సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు


సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో చలి తీవ్రత తగ్గింది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు చలి తీవ్రత కొనసాగాల్సి ఉంది. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడా కనిపిస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో హన్మకొండలో సాధారణం కంటే 5డిగ్రీలు అధికంగా 37డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల తేడా ఉంది. నిజామాబాద్‌లో 5డిగ్రీలు అధికంగా 22 డిగ్రీలు, రామగుండంలో 5 డిగ్రీల తేడాతో 23 డిగ్రీలకు చేరుకుంది. ఎల్‌నినో కారణంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top