ఉద్యోగాల భర్తీ ఒట్టిమాటే

ఉద్యోగాల భర్తీ ఒట్టిమాటే - Sakshi


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర యువతకు కల్పించిన ఉద్యోగాలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన తప్పుల తడకగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.


నిరుద్యోగ యువ తను మభ్యపెట్ట కుండా ఏ శాఖ లో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయి? ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫి కేషన్‌ ఇచ్చారన్న వివరాలతో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు 27,660 పోస్టులు భర్తీ చేశామని, ఇంకో 36,800 పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని, మరో 48,070 పోస్టులను దశల వారీగా భర్తీ చేస్తామని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారని, ఆ జాబితా లోనే ఆర్టీసీలో 3,950 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారన్నారు. ఈ పోస్టులకు ఎప్పుడు  భర్తీ చేశారో ఆర్టీసీ యాజమాన్యానికే సమాచారం లేకపోవడం విడ్డూరమన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top