వారెవ్వా ఏమి ఫోజు.. అందరూ ఫిదా బాసు..

వారెవ్వా ఏమి ఫోజు.. అందరూ ఫిదా బాసు..

సాక్షి, హైదరాబాద్‌: హాస్యాన్ని పండించేందుకు నెటిజన్లకు సోషల్‌ మీడియా చక్కని వేదికగా మారింది. ఎక్కడికెళ్లినా స్మార్ట్‌ ఫోన్‌తో వింతగా సెల్ఫీలు దిగుతూ వాటిని పోస్టు చేస్తూ కామెంట్లు, లైక్‌లతో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక ఫోటో ఫోజును చూస్తే మీకు నవ్వు రాకుండా ఉండదు... ఇక ఈ ఫోటో కామెంట్లు చదివితే కిందపడి మరీ నవ్వుతారు..  కేవలం మాములు కామెంట్లతోనే కాకుండా ఫోటోషాఫ్‌ స్కిల్స్‌తో ఈ ఫోటోను ఎడిట్‌ చేస్తూ.. ట్వీట్‌ చేస్తున్నారు.

 

ఇక కొందరైతే ‘వారెవ్వా ఏమి ఫోజు... మేమందరం ఫిదా బాసు’ అని పాడుకుంటున్నారు. ఇంకొందరు ఈ ఫోటోను వ్యంగ్యంగా పెన్‌,పేపర్‌ లేని సమయంలో కొసైన్‌ వేవ్‌ను చూపించాలంటే ఈ ఫోజు సరిపోతుందని చలోక్తులు విసురుతున్నారు. 

 

 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top