సు‘బాస్’ నగర్!

సు‘బాస్’ నగర్!


80,098 ఓటర్లతో సుభాష్ నగర్ టాప్

చివరి స్థానంలో దత్తాత్రేయ నగర్

కొత్త ఓటర్ల జాబితాపై సర్వత్రా ఆసక్తి


 

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ కొత్త ఓటర్ల జాబితా ఆసక్తి రేకెత్తిస్తోంది. నూతనంగా ఏర్పాటైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్  ఓటర్ల పరంగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ డివిజన్‌లో అత్యధికంగా 80,098 మంది ఓటర్లు ఉన్నారు.  గోషామహల్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్ డివిజన్ కేవలం 29,959 మంది ఓటర్లతో చివరి స్థానంలో ఉంది. ఆ లెక్కన సుభాష్‌నగర్ డివిజన్‌లో గెలవడమంటే.. దత్తాత్రేయనగర్ వంటి  మూడు వార్డుల్లో విజయంతో సమానం. మహిళా ఓటర్లూ ఇక్కడే ఎక్కువ. మొత్తం 34,152 మంది  మహిళలు ఉన్నారు. దత్తాత్రేయ నగర్ డివిజన్‌లోని మొత్తం ఓటర్ల కంటే ఇక్కడి మహిళలే ఎక్కువ. ఆ తరువాత హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. నాగోల్, ఘాన్సీబజార్ డివిజన్‌లలో ఎక్కువగా 21 మంది వంతున థర్డ్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. సుభాష్‌నగర్ తర్వాతి స్థానాల్లో మైలార్‌దేవ్‌పల్లి(70,749 ఓటర్లు), హఫీజ్‌పేట (67,540), కొండాపూర్ (66, 246 ఓటర్లు), కుత్బుల్లాపూర్ (62788 ఓటర్లు) ఉన్నాయి. 7 డివిజన్లలో 60 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. 55 డివిజన్లలో 50 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీటిలో 21 డివిజన్లలో 55 వేలకు పైగా ఉన్నారు.



దత్తాత్రేయనగర్‌లో అతి తక్కువగా...

అతి తక్కువగా దత్తాత్రేయ నగర్‌లో 29,959 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెహదీపట్నం (31,114), రామ్‌గోపాల్‌పేట (31,738), నవాబ్‌సాహెబ్‌కుంట (31,867), శాస్త్రిపురం(32,023), ఆర్‌సీపురం(32,513), పురానాపూల్ (33,537), టోలిచౌకి(33, 891), సులేమాన్ నగర్(33,998), బార్కా స్ (34,065), మెట్టుగూడ (34,236), దూద్‌బౌలి(34,565), భారతినగర్ (34,768), మొఘల్‌పురా (34,773)లు ఉన్నాయి. 40 వేల లోపు ఓటర్లు గలవి డివిజన్లు మొత్తం 29 ఉన్నాయి.

 

మహిళలు ఎక్కువగా...


 సుభాష్‌నగర్‌లో మహిళా ఓటర్లు అత్యధికంగా 34,152 మంది ఉన్నారు. ఆ తర్వాత హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 25 వేలకు పైగా ఉన్న డివిజన్లు మొత్తం 26 ఉన్నాయి. అవి..  సరూర్‌నగర్ (28,474), ఆర్‌కేపురం(27,716), సైదాబాద్ (27,638), మూసారాంబాగ్ (25,367), ఐఎస్‌సదన్ (25,398), మైలార్‌దేవ్‌పల్లి (29,830), జాంబాగ్(26.878), గన్‌ఫౌండ్రి(25116), అంబర్‌పేట (25318), బాగ్‌అంబర్‌పేట (25504), రామ్‌నగర్ (26126), ఖైరతాబాద్ (25614), కొండాపూర్ (28252),బాలాజీనగర్ (26828), అల్లాపూర్ (25193), కుత్బుల్లాపూర్(27032), నేరేడ్‌మెట్ (25999), మౌలాలి (26913), ఈస్ట్‌ఆనంద్‌బాగ్(25279), మల్కాజిగిరి (26847), గౌతమ్ నగర్ (27898), తార్నాక (27973), బన్సీలాల్‌పేట(25016), మోండామార్కెట్(25592), మహిళా ఓటర్లు తక్కువగా ఉన్న డివిజన్లలో దత్తాత్రేయనగర్ (14012), రామ్‌గోపాల్‌పేట (14433 ), మెహదీపట్నం(14814)ఉన్నాయి.

 

అయినా అంతే..

 వార్డుల మధ్య పదిశాతం వ్యత్యాసంతో ఒక్కో వార్డు జనాభా (2011 లెక్కల మేరకు) దాదాపు 40 వేల నుంచి 47 వేల వరకు  ఉండేలా డీలిమిటేషన్‌ను పూర్తి చేసి న సంగతి తెలిసిందే. తాజా లెక్కల మేరకు ఓటర్లు కొన్ని డివిజన్లలో 65 వేలకు దాట గా, కొన్ని డివిజన్లలో 40వేల లోపు ఉన్నా రు. అభివృద్ధి పనుల్లో వ్యత్యాసం లేకుండా ఉండేందుకని డీలిమిటేషన్ చేసినప్పటికీ, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

 

అప్పుడు.. ఇప్పుడు

 2009 ఎన్నికలకు, ఇప్పటికీ డివిజన్ల ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో దాదాపు 20 వేల ఓటర్లున్న డివిజన్లలో ప్రస్తుతం 40వేలకు పెరగ్గా... అప్పట్లో 70 వేలకు పైగా ఓటర్లు ఉన్న డివిజన్లలో ప్రస్తుతం 51 వేలకు తగ్గారు.  

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top