రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా 277 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన అరవల్లి విద్యుత్ కంపెనీ నుంచి  విద్యుత్‌ను రాష్ట్రానికి కేటాయించినట్లు ఇంధన కో-ఆర్డినేషన్ సభ్యకార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి రాజభవన్‌కు వర్తమానం అందినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే హర్యానా కంపెనీ 226 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తోందని తెలిపారు.  తాజా కేటాయింపుతో 503 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు కరెంట్ కొనుగోలు కు సంబంధించిన ఒప్పందాలను చేసుకోనున్నాయి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top