పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు


హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-సాయినగర్ మధ్య, కాచిగూడ-గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-సాయినగర్ (07267/07268) ప్రత్యేక రైలు ఈ నెల 13, 27వ తేదీల్లో రాత్రి 10.45 కు కాచిగూడ నుంచి, రాత్రి 11.10 కి మల్కాజిగిరి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు సాయినగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14, 28 తేదీలలో సాయంత్రం 7.10 కి సాయినగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు మల్కాజిగిరి, ఉదయం 9.35 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకుంటుంది.



కాజీపేట్ మీదుగా కాచిగూడ-గుంటూరు మధ్య 10 డబుల్ డెక్కర్ రైళ్లు నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. నడికుడి మీదుగా కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైళ్లను ఆ మార్గంలో రద్దు చేసి, తాత్కాలికంగా కాజీపేట్ మీదుగా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-గుంటూరు (02118) డబుల్ డెక్కర్ ఈ నెల 16, 18, 20, 22, 24 తేదీలలో రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (02117) ఈ నెల 17, 19, 21, 23, 25 తేదీలలో రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25 కు కాచిగూడ చేరుకుంటుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top