ఎగిరిపోతే....

ఎగిరిపోతే.... - Sakshi


ఒకరికి పండై... తనువు పుండైన తరుణులు వారు. గుండెలేని లోకంలో బండబారిన బతుకులు వారివి. పగబట్టిన పరిస్థితులు కొందరిని ఈ మురికికూపంలోకి నెట్టేస్తే, బలవంతంగా ఈ రొంపిలోకి వచ్చిపడినవారు మరికొందరు. ఒక్కసారి ఇందులో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం దాదాపు అసాధ్యమని తెలుసుకున్నాక.. నిస్సహాయంగా పరిస్థితులకు అలవాటు పడిపోతారు. బతుకు పోరులో బరితెగిస్తారు.



అన్నింటా ఆరితేరిపోతారు. విటులకు శృంగారౌషధమిచ్చి, తాము  రోగాల బారినపడి‘పోతారు’. ఈ నరకం నుంచి విముక్తి కోసం ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంద’నుకుని కలలుకనే.. సొంత పేర్లను చెప్పుకునేందుకు కూడా ఇష్టపడని సెక్స్‌వర్కర్లను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పలకరించారు. వారి ఆవేదనను మన ముందుంచారు.

 

సుద్దాల అశోక్ తేజ: మిమ్మల్ని చూస్తుంటే నాకో పాట గుర్తొస్తుందవ్మూ.. ‘ఎవరు వీళ్లు.. ఎవరు వీళ్లు.. మన రక్తం పంచుకున్న జాతి ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి బరువులు.. తెలుగుజాతి పరువులు.. మన తెలుగుజాతి ఆడ పడచులు..’ సెక్స్‌వర్కర్స్. ఈ మాట నోట పలకడానికే ఇబ్బంది పడే సభ్యమానవులను నేను చూశాను. మీరు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు?



విజయ: వూది గుంటూరు జిల్లాలో చిన్న పల్లెటూరు. ఆవ్మూనాన్నలతో చెప్పకుండా ప్రేమించినవాణ్ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేశా. కొన్ని రోజులు బాగానే చూసుకున్నాడు. వుుగ్గురు పిల్లలు పుట్టాక ఆయున అసలు రూపం బయుటపడింది. దురలవాట్లకు డబ్బు చాలక దగ్గరుండి మరీ నన్ను ఈ రొంపిలోకి దించాడు. ఈ పని చూసుకుని ఇంటికి వెళ్తూ ఆయనకు కావాల్సిన వుందు,

 మాంసం తీసుకెళ్లాలి. పిల్లలను సాకడం కోసం ఆయన ఏం చెప్పినా చేశాను. పరారుువాళ్లు, కట్టుకున్నవాడి చేతిలో హింసలు భరించాను. గట్టిగా వూట్లాడితే పిల్లల్ని చంపేస్తానని బెదిరించేవాడు. (ఏడుస్తూ..) మేం చీర కట్టుకున్నది సింగారానికి కాదు సార్. చీర చాటున ఉన్న పంటి గాట్లు.. సిగరెట్‌తో కాల్చిన గుర్తులు ఎదుటివారికి కన్పించకుండా ఉండేందుకు సార్.



సుద్దాల: ఎంత దారుణం.. ఈ వృత్తి నుంచి వెనక్కి వచ్చే ఆలోచన ఎప్పుడైనా చేశారా ?



విజయ: ఎన్నోసార్లు చేశాను. కానీ నా మొగుడు ఒప్పుకోలేదు. ఒక్కోసారి చనిపోవాలనిపించేది. అప్పుడు నా వుుగ్గురు పిల్లలు గుర్తొచ్చేవారు. అందులో ఒక ఆడపిల్ల. దాన్ని కూడా ఇదే వృత్తిలోకి దింపుతాడేమోనని భయపడి చావలేక బతికాను. పదిహేనేళ్లు నరకం చూశాను. నగరంలోని చైతన్య మహిళా మండలి (సీఎమ్‌ఎమ్) అని మాకోసం స్థాపించిన ఓ స్వచ్ఛంద సంస్థలో చేరాను. దాని అండతో ఈ వృత్తి నుంచి బయటపడ్డాను. నా భర్తను వదిలించుకున్నాను. ప్రస్తుతం నా పిల్లలు బాగున్నారు.



 సుద్దాల: వెరీగుడ్... నీ గురించి చెప్పమ్మా?



కవిత: వూది విశాఖపట్నం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సిటీకి వచ్చాక అతడికి ఉద్యోగం లేదని తెలిసింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. కనీసం పాలడబ్బాకు పైసలు ఇచ్చేవాడు కాదు. ఓ రోజు ఇంటికి ఒకతణ్ని తీసుకొచ్చాడు. నేను ఒప్పుకోలేదు.. బెదిరించాడు. అలా రోజుకొకర్ని తీసుకొచ్చి వాడి కడుపు నింపుకున్నాడు. తర్వాత గొడవల కారణంగా ఇద్దరం విడిపోయూం.



సుద్దాల: అతడ్ని వదిలేశావు.. వురి వృత్తిని ?



కవిత: ఇంకా లేదు సార్. పిల్లల పోషణ కోసం తప్పడంలేదు.

సుద్దాల: ఈ వృత్తిలోకి వచ్చాక.. వుళ్లీ వెనక్కి పోకుండా మీకు వుత్తు పదార్థాలు అలవాటు చేస్తారని విన్నాను.. నిజమేనా ?

కవిత: భర్తతో కలిసుంటే సంతోషం కానీ.. ఈ బతుకు నరకంతో సవూనం. మత్తులో ఆ జ్ఞాపకాలను, శారీరక బాధను వురచిపోతాం.

సుద్దాల: మీరీ పని చేస్తున్నట్టు మీ పిల్లలకు తెలుసా ?

రాణి:  ఊహూ..

లీల: తెలియుదు సార్

సుద్దాల: మీ సంగతి చెప్పండవ్మూ?

లీల: వూది పశ్చివుగోదావరి జిల్లా.. ప్రేవువివాహం.

 

సుద్దాల
: ఒక్క నిమిషం తల్లీ.. ఎవరు చెప్పినా ముందు ప్రేమతోనే మొదలుపెడుతున్నారు. ప్రేవు ఎంతో గొప్పదని మేం రాస్తున్నాం.. దర్శకనిర్మాతలు తీస్తున్నారు.. అందరూ చూస్తున్నారు. కానీ మీరు చెబుతున్న వూటలు వింటుంటే..ప్రేవుకీ, ఆకర్షణకీ ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది.. ఆకర్షణలో పడి కన్నవారికి దూరమై కష్టాలు కొని తెచ్చుకోవద్దు.. అసలేం జరిగింది..?

 లీల: నా భర్త వూకు దూరపు బంధువే. ఇంట్లో వాళ్లని కాదని అతడితో వచ్చేశాను. పెద్ద జూదగాడని తర్వాత తెలిసింది. నాకిద్దరు పిల్లలు. వీరి కథల్లాగే.. నా బతుకూ పాడైపోరుుంది(కన్నీళ్లతో..) పిల్లల వుుందే నన్ను బ్రోకర్ల చేతిలో పెట్టాడు.

సుద్దాల: ఈ బ్రోకర్స్ దందా పేరుతో కోటీశ్వరులవుతున్నారు. వారికి ఏ వులినవుూ అంటదు. వారికి ఏ బాధలు ఉండవు. ఒంటిపై గాయూలుండవు.. వాళ్లు వూత్రం నీతివుంతుల్లా గొప్పగా బతికేస్తున్నారు. మీరు వూత్రం కడుపున పుట్టిన పిల్లల కోసం నరకాన్ని అనుభవిస్తున్నారు.



రాణి: మా బతుకులు ఇంతే సార్. ఈ వృత్తి ఒక నరకమంటే.. ఇందులోకి వచ్చాక మొదలైన అలవాట్లు ఇంకో నరకం.

సుద్దాల: లేదమ్మా.. మీలాంటి వారిని అక్కున చేర్చుకుని.. రక్షిస్తున్న సీఎమ్‌ఎమ్ వంటి సంస్థలను ప్రభుత్వం వుండలానికొకటి స్థాపించాలి. వుుఖ్యంగా డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారికి ప్రత్యేకంగా ట్రీట్ చేయూలి. మీ గురించి చెప్పండవ్మూ..?

జ్యోతి: మాది కావూరెడ్డి. మా నాన్నకు ఐదుగురు ఆడపిల్లలం. నిరుపేద కుటుంబం. పక్క ఊరి కుర్రాడికిచ్చి పెళ్లి చేశారు. వాడికి లేని అలవాటు లేదు. పనీ లేదు. అత్తవూవులేమో కట్నం తెవ్ముని పుట్టింటికి పంపించేశారు. ఎన్ని కష్టాలొచ్చినా కట్టుకున్నవాడితోనే ఉండవుని వాళ్లు అత్తారింటికి పంపించేశారు. బతుకుతెరువు కోసం నా భర్తతో కలసి హైదరాబాద్ వచ్చేశా. ఇక్కడికొచ్చాక ఇదే మార్గమన్నాడు. కన్నవారు పట్టించుకోలేదు.. కట్టుకున్నవాడు కనికరించలేదు. అందుకే గత్యంతరం లేక ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను.

 సుద్దాల: కన్యాదానంతో కన్నవారి బాధ్యత తీరిపోతుందా..? దయుచేసి ఆడపిల్లల గురించి ఆలోచించండి. వారికి అన్యాయుం జరిగితే అక్కున చేర్చుకోండి. న్యాయుం జరిగే వరకు పోరాడండి.

మహాలక్ష్మి: వూకు తెలిసిన ఒకామె ఇదే వృత్తిలో ఉంటూ కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. వాడికి పెద్ద ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసింది. తల్లి గురించి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉందని ఆ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. భార్యతో కలసి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తల్లితో తాగించి ఇంట్లో ఉంచి గొళ్లెం పెట్టారు. కొన ఊపిరితో బయుటపడింది.

 సుద్దాల: వాణ్ణి పోషించినప్పుడు, చదివించినప్పుడు ఆ అవ్ము ఏం చేస్తుందో అక్కర్లేదు. కానీ సమాజంలో మంచి స్థితికి వచ్చేసరికి తల్లి గతం నచ్చలేదు. అందుకే అమ్మను అడ్డం తొలగించుకోవాలనుకున్నాడు.

 జ్యోతి : రేపు వూ పరిస్థితి కూడా అంతే కదా సార్. అవ్మూరుులైతే అర్థం చేసుకుంటారు. అబ్బారుులు కదా సార్. ఎంతైనా వాళ్లూ

మాగవాళ్లే!

సుద్దాల: ఇది నిజంగానే ఆలోచించాల్సిన విషయుం. వృత్తి వదిలేసిన తర్వాత కూడా ఈ స్థారుులో కష్టాలున్నాయుంటే ఇది చాలా పెద్ద సవుస్య..

రాధిక : మేం వృత్తిలోకి వచ్చిన రోజే సగం చచ్చిపోయూం. మిగతా సగం ఇదిగో.. ఇలా రకరకాలుగా చస్తుంటాం..

 సుద్దాల: బిడ్డలే తల్లుల్ని చంపాలనుకునే పరిస్థితి చాలా దారుణం. నా తోటివారిని, ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను. నగరంతో పాటు దేశంలో లక్షల వుంది ఆడపడచులు ఈ వృత్తిలో నలిగిపోతున్నారు. వారిని ఈ వృత్తిలోకి అడుగుపెట్టకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. వీరిని కూడా గౌరవంగా చూడండి. వీరి వూర్పును వునసారా కోరుకోండి.

 

 

 ‘వెలయాలువా.. ? సంఘం వెలవేసిన వెలదివా.. మలినాంగుల తలనొలికిన జాలారుల జలమువా.. పతిదేవుని ఒడిలోపల బతకాల్సిన నీ జన్మను.. పతితుల కౌగిళ్ల చేర్చి పతితగ నిను చేశారా.. బూడిదలో క్రూరముగా పోసిన పన్నీరువా.. ముళ్లపొదలలో విసిరిన మల్లెపూల దండవా’.. ఇది నేను ఎప్పుడో రాసిన పాట. ఇంటర్‌లో ఉండగా వూ ప్రిన్సిపాల్ పాటలు రాసే పోటీ పెట్టారు. నేను హైదరాబాద్ పాతబస్తీలోని మహబూబ్ కా మెహందీ



హవేలీలోకి వెళ్లి వ్యభిచార గృహం నడిపిస్తున్న ఒక పెద్దామెను కలసి మాట్లాడాను. ఓ వేశ్యను కలసి ఆమె జీవితం గురించి తెలుసుకుని ఈ పాట రాసి మొదటి బహుమతి పొందాను. ఈ రోజు స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని వుళ్లీ పలకరించే అవకాశం వచ్చింది. పగబట్టిన పరిస్థితులు ఆడకూతుళ్లను ఈ రొంపిలోకి దించుతారుు. ప్రతిక్షణం ఈ వృత్తిని అసహ్యించుకుంటూనే.. వద్దనుకుంటూనే కొనసాగుతుంటారు. ఈ పాపకూపం నుంచి బయుటపడలేక వునస్థితికో.. పరిస్థితికో లోబడి పని చేస్తున్న చెల్లెళ్లు, తల్లులెందరో. వీరికొక అన్నగా.. బిడ్డగా నేను ఈ రిపోర్టింగ్ చేశాను.

 

 సిటీలో సెక్స్‌వర్కర్ల సంఖ్య : దాదాపు లక్ష

 సొంతిల్లు లేనివారు : 80 శాతం

 మత్తు పదార్థాలకు బానిసైనవారు : 15వేలు

 బలవంతంగా రొంపిలో పడ్డవారు : 25 వేలు

 

 ప్రెజెంటేషన్: భువనేశ్వరి

 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top