నోట్ల రద్దుతో నల్లకుబేరులకే మేలు

నోట్ల రద్దుతో నల్లకుబేరులకే మేలు - Sakshi

  • దళిత హక్కుల సాధన సదస్సులో సీతారాం ఏచూరి

  • ఎన్డీయే పాలనలో దళితులపై పెరిగిన దాడులు: సురవరం

  • సాక్షి, హైదరాబాద్‌: ‘పెద్ద నోట్ల రద్దు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రజల డబ్బును బ్యాంకుల్లో జమ చేయించి వారిని ఆర్థికంగా దోపిడీ చేసింది.ఇబ్బందులు ఎదుర్కొంది సామా న్యులే. రూ.కోట్లలో రుణాలు ఎగవేసిన వారికి  విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను ఇచ్చింది’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆదివారం ఇందిరా పార్క్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన జరిగిన దళితుల హక్కుల సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ట్రిపుల్‌ తలాఖ్‌కు చట్టబద్ధత కల్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తలాఖ్‌ ఇచ్చారు.



    ముచ్చటగా మూడోసారి యూపీలో కూడా ఇస్తారు.’ అని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదాన్ని అంతమొందించినట్లు ప్రధాని చెబుతున్నా సెప్టెంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 30 మధ్యకాలంలో భారత సైనికుల మరణాల సంఖ్య రెట్టింపైందన్నారు. హెచ్‌సీయూలో రోహిత్‌ వేము ల ఆత్మహత్యకు కారణాలపై కమిటీ ఇచ్చిన నివేదికను గోప్యంగా ఉంచడంపై అంతర్య మేమిటని ప్రశ్నించారు. ‘ మోదీ పెద్ద నోట్లు రద్దు చేసి గాంధీజీ లేని కొత్తనోట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు చరఖా పట్టుకుని  గాంధీలా అవతరించా లనుకుం టున్నారేమో,  ప్రజల్లో నుంచి గాడ్సేలు పుట్టుకొస్తారు జాగ్రత్త.’ అంటూ హెచ్చరించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ  దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు డి.రాజా, నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



    ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పాలన

    కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్ప టికీ పాలనంతా ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో నే సాగుతోందని అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌అంబేడ్కర్‌ ఆరోపించారు. ‘ఇటీ వల ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒకరు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాని ప్రకటించారు. అధికా రం వారి చేతుల్లోనే ఉంది. పార్లమెంటు లో సంఖ్యా బలం కూడా ఉంది. ఇక ఆలస్య మెందుకు! రిజర్వేషన్లు రద్దు చేసి చూడం డి.ఆ తర్వాతేం జరుగుతుందో చూద్దాం’ అని ఆయన హెచ్చరించారు.  తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి సీఎంని చేస్తానని ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిందని, ఆ హామీ నిల బెట్టుకోలేకపోగా ఎస్సీ, ఎస్టీలకు కేటా యించిన నిధులను దారిమళ్లించి సాగు నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లిస్తోందని అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top