నరకం.. ఆ రైళ్లలో ప్రయాణం!

నరకం.. ఆ రైళ్లలో ప్రయాణం!


దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ఎక్స్‌ప్రెస్‌లలో తీవ్ర సమస్యలు

ప్రయాణంలో భారీ కుదుపులు.. బెర్తుల్లోంచి కిందపడుతున్న ప్రయాణికులు

బోగీలు విడిపోకుండా ఏర్పాటు చేసిన సీబీపీ కప్లర్లతో తలెత్తిన సమస్య




సాక్షి, హైదరాబాద్‌: అది హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌.. అర్ధరాత్రి.. రైల్లో అంతా గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు.. బెర్తుల్లోంచి కొందరు కిందపడిపోగా, పక్క బెర్తుల్లో పడుకున్న వారి తలలు బోగీ గోడలకు బలంగా గుద్దుకు న్నాయి.. అప్పర్‌ బెర్తుల్లోని లగేజీ కిందపడి పోయింది. అందరూ గాఢ నిద్రలో ఉండ టంతో బోగీలు పట్టాలు తప్పాయేమో అని భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది సాంకేతిక పరమైన సమస్యతో ఏర్పడ్డ కుదుపు అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు. బోగీ–బోగీని కలిపి ఉంచే కప్లింగుల్లో చేసిన మార్పు ఇప్పుడు ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది.



గతంలో ఉన్న సంప్ర దాయ స్క్రూ కప్లర్ల స్థానంలో కొత్తగా సెంటర్‌ బఫర్‌ కప్లర్ల (సీబీపీ)ను ఏర్పాటు చేయటంతో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. పాత కప్లర్లకు కుషన్‌ విధానం ఉండేది. ఇంజిన్‌ వేగం పెరిగి నా, బ్రేకు వేసినా బోగీబోగీ మధ్య ఘర్షణ ఏర్పడ్డప్పుడు కప్లర్లకు ఉన్న కుషన్‌ వల్ల కుదుపు ఏర్పడేది కాదు. కానీ కొత్తగా ఏర్పా టు చేసిన కప్లర్లలో కుషన్‌ విధానం లేక రెండు బోగీల కప్లర్లు వేగంగా గుద్దుకుని బోగీల్లో భారీ కుదుపులు ఏర్పడుతున్నాయి. రైలు భారీ వేగంలో ఉన్న సమయంలో కుదుపులు ఏర్పడితే బెర్తుల్లోంచి కిందపడిపోయేంతగా ఉంటున్నాయి. బెర్తుల్లో పడుకు ని ఉన్నవారు కిందపడిపోవటం, తలలు బోగీ పార్టీషన్‌ గోడకు ఢీకొని గాయపడటం వంటివి జరుగు తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.



ఈ రైళ్లలోనే ఇబ్బందులు...

దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్‌–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ గౌతమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌– విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరా బాద్‌–కోల్‌కతా షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–చెన్నై చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లకు ఈ సీబీపీ కప్లర్లు అమర్చారు. కానీ, వీటివల్ల కుదుపులతో ప్రయాణికులు గాయపడుతు న్నారు. వారి నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో కొత్త కప్లర్లను మార్చాలని రైల్వే నిర్ణయించింది. కానీ ఉన్న వాటిని మా త్రం తొలగించలేదు. తాజాగా తెలంగాణ, గౌతమి, గోదావరి తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు  పెరిగాయి. దీంతో అధికారులు విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.



ఎందుకీ పరిస్థితి..

పాత కప్లర్లలో భద్రత పరమైన లోపాలున్నాయని గుర్తించిన రైల్వే.. కొత్త సీబీపీ కప్లర్లను తయారు చేయిస్తోంది. రైల్వేనే సొంతంగా వాటిని సిద్ధం చేసుకుం టోంది. గతంలో వేగంగా వెళ్తున్న కొన్ని రైళ్ల బోగీలు విడిపోయి ప్రమాదాలు జరగడానికి కప్లర్ల డిజైన్‌ లోపమే కారణమని గుర్తించిన రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాల మధ్య తిరిగే ఎక్కువ బోగీలుండే రైళ్లు, వేగంగా వెళ్లే రైళ్లకు తొలుత వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 21, అంతకంటే ఎక్కువ బోగీ లున్న రైళ్లలో బోగీలు విడిపోయే ప్రమాదం ఉందని, వాటికి యుద్ధప్రాతిపదికన కొత్త కప్లర్లను అమరుస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top