హావ్ ఏ సేఫ్ ఫెస్ట్

హావ్ ఏ సేఫ్ ఫెస్ట్


రంగుల కేళీ హోలీ రానే వచ్చింది. పండుగ పూట రంగురంగుల హరివిల్లులవ్వడం అందరికీ ఇష్టమే. కానీ ఆ ఇష్టం కష్టంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అందుకు ఫేస్ యోగా ఎక్స్‌పర్ట్ మాన్సీ గులాటీ కొన్ని టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటించి జోష్‌ఫుల్ హోలీని సక్సెస్‌ఫుల్ చేసుకోండి... హోలీ ఆడడానికి గంట ముందు ముఖం, చేతులకు కొబ్బరి నూనెను రాసుకోవాలి.  నేచురల్, ఆర్గానిక్ కలర్స్‌ను మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. వీటివల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు.  పిల్లలకు పసుపు, కుంకుమ, గంధం, విభూది లాంటివి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ల చర్మం చాలా సున్నితమైంది. మార్కెట్‌లో దొరికే కలర్స్ వాడితే ప్రమాదం. పసుపులో యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి.

 

 యాంటీసెప్టిక్ కూడా. ఆడాక ముఖం, ఒంటిపై రంగులు పోకపోతే సహజంగా ముఖంపై గోర్లతో గీరడం, కిరోసిన్‌తో కడగ డం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అది ప్రమాదకరం. బొప్పాయి గుజ్జు తీసుకుని మర్దన చేస్తే... ఎంతటి ముదురు రంగైనా సునాయాసంగా వదిలిపోతుంది.  

 

 ముఖంపై రంగులు తొలగించడానికి చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటితో కడిగితే రంగులు చర్మానికి ఇంకా అతుక్కుపోతాయి.  ఆట తరువాత మాయిశ్చరైజర్ లేదంటే బేబీ ఆయిల్‌ని లైట్‌గా ముఖానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా, దద్దుర్లు రాకుండా ఉంటుంది.

 

 

 ఆడేటప్పుడు తలపై రంగులు, గుడ్డు కొట్టినప్పుడు జుట్టు మొదళ్లలోకి చేరి స్కాల్ప్ పొడిబారే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తలకు బేబీ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ రాయాలి. చేతిగోళ్లలో రంగులు పోకుండా వారాల తరబడి ఉంటాయి. వాటిని వదిలించేందుకు పెడిక్యూర్, మానిక్యూర్‌లాంటివి పదేపదే చేయించకూడదు. ముందుగానే పెట్రోలియం జెల్లీని చేతివేళ్లకు అప్లై చేస్తే గోళ్లలోకి రంగులు పోవు.

 సిరి









 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top