పైశాచికంగా ప్రవర్తించాడు...

పైశాచికంగా ప్రవర్తించాడు... - Sakshi


ఎన్నారై భర్త శాడిజాన్ని వెల్లడించిన బాధితురాలు



హిమాయత్‌నగర్: ‘ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తున్న ఏడాది పాపకు పాలిస్తుంటే.. రొమ్ముపై కాలితో తన్ని, చిన్నారిని పక్కకు ఈడ్చేశాడు’’ నా భర్త అంటూ బాధితురాలు కన్నీరు మున్నీరైం ది. తనపై అనుమానంతో ముందు తనను నడవమని, వెనుక కెమెరాతో వీడియో తీసి పైశాచికత్వం ప్రదర్శించేవాడని వాపోయింది.  ‘కూతురు పుట్టిందని ముఖం చాటేపిన ఎన్నారై తండ్రి’ అంటూ గురువారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం వచ్చిన విషయం విదితమే. కాగా, బాధితురాలు అర్చనారెడ్డి గురువారం తన బిడ్డ, తండ్రి భగత్‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ సంఘం కమిషన్ సభ్యులు అచ్యుతరావుతో కలిసి మీడియాతో మాట్లాడింది. 2011లో తమకు పెళ్లైంద ని, ఆ తర్వాత అమెరికా తీసుకెళ్లిన భర్త తనను వేధించడం మొదలెట్టాడని చెప్పింది.  2012 ఆగస్టు 20న నగరంలోని ఆసుపత్రితో తనకు ప్రసవం అయిందని, కుమార్తె పుట్టిండంతో ఆసుపత్రికి వచ్చిన భర్త ఐదు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయాడని తెలిపింది. తాను వెళ్లి బతిమాలితే పాప బారసాలకు పాపు గంట ముందు వచ్చి.. వెంటనే అమెరికా వెళ్లిపోయాడంది.



ఆ తర్వాత ఎన్నో రోజు లు భర్తను ఫోన్‌లో బతిమిలాడి అమెరికా వెళ్లాలనని, ఆరు నెలల పాటు ఇంట్లో ఉంచి నరకయాతన పెట్టాడని కన్నీరు పెట్టుకుంది. అనుక్షణం తనపై అనుమానం వ్యక్తం చేస్తూ  దూషించడం,కొట్టడం చేసేవాడని తెలిపిం ది. నాపై కోపాన్ని పాప మీద చూపిస్తూ తాను పాలు ఇస్తున్న సమయంలో రొమ్ముపై తన్నాడని కన్నీరు పెట్టుకుంది.  ఆ తర్వాత మరిది పెళ్లి కోసమని హైదరాబాద్‌కు పంపించ గా.. అత్తమామలు తనను ఇంట్లో ఉండనివ్వకుండా వేధించారని చెప్పింది.  తనపై కోపంతో ఒక రోజు మరిది రాఘవేందర్‌రెడ్డి పాపను బెల్ట్‌తో కొట్టాడని అర్చనారెడ్డి కన్నీరుమున్నీరైంది. భర్త వేధింపులకు గురైన తనకు ప్రతి ఒక్కరూ స్పందించి  న్యాయం చేయాలని కోరింది.





 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top