చెక్‌బౌన్స్ కేసులో డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానా

చెక్‌బౌన్స్ కేసులో డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానా - Sakshi


మియాపూర్ (హైదరాబాద్): చెక్కు బౌన్స్ కేసులో ఓ డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మియాపూర్‌లోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి త్యాగరాజ నాయుడు గురువారం తీర్పునిచ్చారు. గతంలో కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏసీపీగా పనిచేసిన నాగరాజు ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2012లో ఇళ్లు కొనుగోలు విషయంలో కేపీహెచ్‌బీకి చెందిన బిల్డర్ ఉమాకు రూ.6 లక్షలకు రెండు చెక్కులను డీఎస్పీ నాగరాజు ఇచ్చారు. ఆ రెండూ బౌన్స్ కావడంతో ఉమా మియాపూర్ కోర్టును ఆశ్రయించారు.



అప్పటి నుంచి ఇప్పటి వరకు వాదోపవాదాల మధ్య కేసు కొనసాగింది. రూ.6 లక్షలకు మరో ఆరు లక్షలు మొత్తం రూ.12 లక్షల జరిమానా నెల రోజుల్లో చెల్లించాలని, రెండు చెక్ బౌన్స్‌లకు 3 నెలల చొప్పున మొత్తం 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబ్బు చెల్లించని పక్షంలో మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని న్యాయవాది జాగర్లమూడి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే డీఎస్పీ నాగరాజు కోర్టులోనే రూ.3 లక్షలు చెల్లించటంతో పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top