టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటం

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటం - Sakshi


► టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

► మంత్రుల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు


సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో వైఫల్యాలపై నిరవ ధిక ఆందోళనలను నిర్వహించాలని నిర్ణ యించినట్టుగా టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. పార్టీ నేతలు బోడ జనార్దన్ , వీరేందర్‌గౌడ్‌తో కలసి ఈ సమావేశం వివరాలను విలేకరు లకు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంతో మొదలుపెట్టి, మంత్రులందరి నియోజక వర్గాల్లో బహిరంగసభలు పెడ్తామన్నారు.


ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యంపై ప్రజల్లో ఎండగడ్తామని, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను వివరిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అన్ని అంశాలకూ విధానాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ ఎక్కువమంది ఆధారపడి న వ్యవసాయ రంగానికి విధానాన్ని రూపొందించ లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, ఇన్ పుట్‌ సబ్సిడీ ఇవ్వలే దని, రైతుల పంటలను కొనే దిక్కులేక పోవడంతో అధికారుల కాళ్లు మొక్కుతున్నా సీఎం కేసీఆర్‌కు కనికరం కలగడం లేదని రేవంత్‌ విమర్శించారు.



ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ వైఫల్యం

ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యం చెందిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు అనుకూలవర్గం, వ్యతిరేక వర్గంగా ఆ పార్టీ చీలిపోయిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల ను మురగబెడుతూ, వాటిని దారిమళ్లిస్తున్నా బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఒకచేతిలో బీజేపీ, మరో చేతిలో ఎంఐఎంను పట్టుకుని కేసీఆర్‌ నడుస్తున్నారన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పార్టీ సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వీరేందర్‌గౌడ్‌ వెల్లడించారు. బోడ జనార్దన్   మాట్లాడుతూ దళితులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలను అమలుచేయని కేసీఆర్‌పై పోరాడుతామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top