‘రిఫ్లెక్సాలజీ’ c/oనార్మల్‌ డెలివరీ

‘రిఫ్లెక్సాలజీ’  c/oనార్మల్‌ డెలివరీ - Sakshi


రిఫ్లెక్సాలజీతో గర్భిణులకు సుఖప్రసవం

నగరంలో విస్తరిస్తున్న  రిఫ్లెక్సాలజీ సెంటర్లు




హిమాయత్‌నగర్‌: పెళ్లి తరువాత పిల్లలను కనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకోసం గర్భం దాల్చినప్పటినుంచి బిడ్డను ప్రసవించే వరకూ వైద్యుల సూచనలతో తగు జాగ్రత్తలు తీసుకుంటుం టారు. అయినా కొన్ని అనివార్య కారణాలతో అబార్షన్లు జరుగుతూ ఉంటాయి. పూర్వం పాదాలు, మోకాలు, మోచేతి, చెయ్యి తదితర భాగాలపై మసాజ్‌ చేయడం ద్వారా సుఖప్రసవానికి అవకాశం కల్పించేవారు. ఇదే తరహాలో రిఫ్లెక్సాలజీ ద్వారా నార్మల్‌ డెలివరీకి కృషి చేస్తున్నట్లు  కొత్తగూడెంకు చెందిన ‘అక్షర్‌ వెల్‌నెస్‌’ ఫౌండర్‌ ఇందుమతి పేర్కొన్నారు. ఈ తరహా రిఫ్లెక్సాలజీ సెంటర్లు ఇప్పుడు నగరంలో విస్తరిస్తున్నాయన్నారు. గర్భవతులకు, బాలింతలకు సేవలు అందిస్తున్నామన్నారు.



‘రిఫ్లెక్సాలజీ’ రిలాక్సేషన్‌

నూతన దంపతుల్లో ఇద్దరూ ఉద్యోగస్తులే అయితే వారు బిజీగా ఉండటం సాధారణం. ఈ కారణంగా ఇప్పుడే పిల్లలు వద్దునకుని వాయిదా వేసుకునే వారి సంఖ్య నగరంలో అత్యధికంగా ఉంటోంది.  నైట్‌ షిఫ్ట్‌ల్లో పని చేయడం వల్ల కూడా ప్రసవంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారికి రిఫ్లెక్సాలజీ ద్వారా మానసిక ఆనందంఆరోగ్యం, మెరుగుపడుతుందన్నారు.



పాదాల ద్వారా..

అరిచేతులు, పాదాలు, చెవుల్లోని బాహ్య నాడీ వ్యవస్థ ద్వారా మొత్తం శరీరం ప్రతిఫలిస్తూ ఉంటుందని చెప్పే మౌళిక సూత్రంపై రిఫ్లెక్సాలజీ ఆధారపడి పని చేస్తోంది. ఒత్తిడి తారాస్థాయికి చేరినప్పుడు శరీరంలోని జీవనక్రియలన్నీ సమతుల్యతను కోల్పోతాయి. ఈ స్థితిలో కాల్షియం అతిగా ఉత్పన్నమై అది స్ఫటికాలుగా మారి పాదాల్లో ప్రత్యేకించి నరాల చివర్లో పేరుకుపోతుంది. దీనివల్ల శరీర అవయవాలు తమ విధుల్ని నిర్వహించలేని స్థితికి చేరుకుంటాయి. ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి రిఫ్లెక్సాలజీస్టులు కాల్షియం స్ఫటికాలను అతి సూక్షమైన తునకలుగా మార్చివేసి అవన్నీ బయటకి వచ్చేలా చేస్తారు.



రిఫ్లెక్సాలజీ ఎలా పనిచేస్తుంది

మెదడు, వెన్నుముక ద్వారా దేహంలోని ప్రతి భాగానికి, గ్రంధికి, కండరానికి అనుసంధానం చేయబడిన 7200 నాడుల కొనలు మన పాదాల్లో ఉన్నాయి. పాదాలు దేహానికి ప్రతిబింబాలు అని మనం భావించవచ్చు. ఊపరితిత్తులు లాంటి అవయవాలకు సంబంధించిన బింధువులు పాదాలపై కనిపిస్తాయి. రిఫ్లెక్సాలజిస్ట్‌ పాదం మీద ఒక నిర్దిష్టస్థాయిలో స్పర్శను ఉపయోగించడం ద్వారా ఒత్తిడికి గురౌవుతున్న, సరిగ్గా పనిచేయలేకపోతున్న శరీర భాగాలను గుర్తించగలుతారు. అవరోధాలను తొలగించి దేహానికి సమతౌల్యాన్ని పునరుద్దరించేందుకు తగినంత ఒత్తిడిని ఆ ప్రతిబింబ బిందువులపై ఉపయోగిస్తారు. దేహానికి స్వతసిద్దంగా స్వస్థతను చేకూర్చుకునే శక్తి సామర్థ్యాలను ప్రేరేపించే పరిపూర్ణ థెరపీయే ఈ రిఫ్లెక్సాలజీ. రిఫ్లెక్సాలజీ అనేది రోగనిరోధక థెరపి, క్రమం తప్ప కుండా రిఫ్లెక్సాలజీస్ట్‌ను సందర్శించడం, క్రమం తప్పకుండా ఇంటి వద్దనే ఈ విధానాన్ని అవలంబించడం చాలా మంచింది. గర్భం దాల్చినవారు దీనిని అనుసరిస్తే నార్మల్‌ డెలవరీకి అవకాశం ఉంటుందన్నారు. ‘అక్షర్‌ వెల్‌నెస్‌’ద్వారా రిఫ్లెక్సాలజీ చేయించుకున్న వారు తాము నార్మల్‌ డెలవరీ ద్వారా పిల్లలను కన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి గలవారు 040–23000234, 9493493759 నంబర్లను సంప్రదించాలని సూచించారు.



నార్మల్‌ డెలివరీకి ఉపయోగకరం

ఒత్తిళ్ల కారణంగా వచ్చే నాడీగత సమస్యలకు విరుగుడుగా రిఫ్లెక్సాలజీ అనే అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. చైనా టావోయిస్టు, మేయాన్‌స, భారతదేశానికి చెందిన చెరోకిలా సంస్కృతీ మూలాల నుంచి ఐదు వేల ఏళ్ల క్రితమే ఈ విధానం అవతరించింది. గర్భిణిలకు ఇది చాలా అవసరం. గర్భం దాల్చినప్పటి నుంచి రిఫ్లెక్సాలజీ చేయించుకుంటే నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. – ఇంధుమతి, అక్షర్‌వెల్‌నెస్‌ ఫౌండర్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top