ప్రజలకు ఒరిగిందేమీలేదు

ప్రజలకు ఒరిగిందేమీలేదు - Sakshi


కేసీఆర్ పాలనపై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ధ్వజం

విద్యార్థి పోరుగర్జన సభకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు


హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థి, యువత సంక్షేమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా మండిపడ్డారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో విద్యార్థి పోరుగర్జన సభ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున సభకు తరలివచ్చారు. కుంతియా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. విద్యార్థులు ఆశించిన విధంగా ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. ఆదివాసీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల మాట ఏమైందని నిలదీశారు. ఉపకారవేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ విడుదలకు విద్యార్థుల సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


 సంక్షోభంలో విద్యారంగం: ఉత్తమ్

సర్కార్ నిర్లక్ష్యం, అసంబద్ధ చర్యలతో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోరుుందని, 3,200 ప్రైవేట్ కళాశాలలు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారిందని, రెండున్నర లక్షల మంది లెక్చరర్లు, సిబ్బంది ఆరు నెలలుగా జీతాలులేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాప్రమాణాలు పెరగాలని, పేదవిద్యార్థులు అడగకముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అందించిందని సీఎల్‌పీ నేత జానారెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడిగినా కూడా ఇవ్వకుండా విద్యార్థులను బజారుపాలు చేస్తోందన్నారు. 


పండుగలు, వాస్తులకు కోట్ల  వెచ్చిస్తోందని, కట్టడాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండలిలో విపక్షనేత షబ్బీర్ విమర్శించారు.  కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీమంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బిక్షపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


నేడు ఆర్మూరులో గ్రామీణ విద్యార్థి, యువ గర్జన

ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరులో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థి, యువ గర్జన శుక్రవారం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియాతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు దీనికి హాజరుకానున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top