నగ్నంగా నృత్యం... ప్రశ్నించినందుకు దాడి

నగ్నంగా నృత్యం... ప్రశ్నించినందుకు దాడి - Sakshi


నాగోలు: దుస్తులు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారేంటి? అని అడిగిన పాపానికి ఓ యువకుడిపై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. ఎల్బీనగర్ పోలీసులు నిందితులపై కేసునమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... ఎల్బీనగర్ బ్యాంక్‌కాలనీలో ఉండే కనకదుర్గమ్మ ఇంటికి ఎదురుగా ఉండే గిరి, జిలానీ, మరో యువకుడు ఒంటిపై దుస్తులు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు.



స్థానిక మహిళ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దూషించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కొడుకు సురేష్ వారిని నిలదీయగా ముగ్గురూ కలిసి దాడి చేసి గాయపరిచారు. సురేష్‌ను చికిత్స నిమిత్తం హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గిరి, జిలానీ తో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top