భాగ్యనగర్..బల్లే బల్లే

భాగ్యనగర్..బల్లే బల్లే


సిక్కు..అంటే ధైర్యం, పట్టుదల, సైనికునికి ఉండే చొరవ, సాహసం గుర్తుకు వస్తారుు. యుుద్ధవిద్యల్లో ఆరితేరిన వీరు నగరం వాకిట ‘రక్షకులుగా’ ఓ రెండువందల ఏళ్ల కిందట అడుగు పెట్టారు. హైదరాబాద్ నవాబు కోరిక మేరకు 1832లో  పంజాబ్ మహారాజు రణజీత్‌సింగ్ సుశిక్షుతులైన ఓ సైనిక పటాలాన్ని పంపారట. అలా వచ్చిన వారు ఇక్కడ విశేష సేవలందించారు. సైన్యంలో కీలక పాత్ర పోషించారు. శిస్తులు వసూలు చేశారు. అలా భాగ్యనగరిలో మమేకమై ‘తెలుగు దనం’ అద్దుకున్నారు. ఇక స్వాతంత్య్రానంతరం వచ్చిన వారు ఇక్కడి వ్యాపారాల్లో నిలదొక్కుకున్నారు. మొత్తం కలిపి నగర జనాభాలో ఓ లక్షకు పైచిలుకు ‘పంజాబీలు’ కనిపిస్తారు.

 

ఇప్పుడు నగరంలో స్థిరపడ్డ వారు దక్కన్ సిక్కులుగా పేరుపడ్డారు. వీరికి ఇడ్లీ, వడ, సాంబారూ ఇష్టంగా మారిపోయారు. కొందరు వుహిళలు అక్కడి సాంప్రదాయు వస్త్రాలైన పంజాబీ దుస్తులతో పాటు, వునవారు ధరించే చీరా,జాకెట్టూ ధరిస్తుంటారు. రోటీకి బదులు అన్నం తింటుంటారు. అంతెందుకు తేట తెలుగులో చక్కగా మాట్లాడి ఔరా! అనిపిస్తారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, ధాబా ల నిర్వహణల్లో ఉంటున్నారు.

 

‘కంటోన్మెంట్’ నుంచి కూకట్‌పల్లి వరకూ...

నగర భద్రతకోసవుని వచ్చిన వీరిని అప్పటి నవాబు  వీరి చౌనీ కోసం కిషన్‌బాగ్‌లో ‘కంటోన్మెంట్’ స్థలాన్ని  ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో గౌలిగూడ గురుద్వారా, అఫ్జల్‌గంజ్‌లో ఉన్న సింగ్ సభ, సికింద్రాబాద్‌లో సిక్‌విలేజ్‌లో ఉన్న గురుద్వారా చుట్టూ వీరుంటున్నారు. రాజేంద్రగనర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోనూ అధికంగా కనిపిస్తారు.

 

వారం..వారం ఆత్మీయ రాగం

నగరంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సిక్కులు ప్రతీ ఆదివారం తమకు చేరువలో ఉన్న గురుద్వారాల్లో కలుసుకుంటారు. ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్ర గురుద్వారా సాహెబాన్ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి చైర్మన్ గురుచరణ్‌సింగ్ బగ్గా . గురుద్వారాలో ‘గురు గ్రంథ్ సాహెబ్’  (వుత గ్రంథం)కు ప్రార్థనలు చేస్తారు. విగ్రహారాధన  ఉండదు.  ఆ రోజు  ‘ఉచిత వంటశాల’ నిర్వహిస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వరుస క్రమంలో కూచున్న వాళ్లందరికీ భోజనం వడ్డిస్తారు. ఈ ‘ఫ్రీ కిచెన్’ తరతరాలుగానడుస్తోంది. ఇది వారి మత సంప్రదాయంలో భాగం. సిక్కులిచ్చే విరాళాలతోనే నడుస్తోంది.

 

 

‘సప్తపదికి’ బదులు ..

వందల ఏళ్ల కిందట వూతృరాష్ట్రాన్ని విడిచి పెట్టినా వారి సంప్రదాయూల్లో కొన్నింటిని మాత్రం తప్పకుండా పాటిస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గది వారి వివాహ వేడుక. హిందూ వివాహంలో అగ్ని చుట్టూ తిరిగే ‘సప్తపది’లాంటిది వీరి ఆచారాల్లో ముఖ్యమైంది. వివాహ సమయుంలో తొలుత నిర్వహించేది ‘అఖండ్ పాఠ్’. దీన్ని 48 గంటల వుుందు నిర్వహిస్తారు. వివాహ సమయుంలో ‘గురు గ్రంథ్ సాహెబ్’ చుట్టూ నాలుగు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ సందర్భంలో ‘ఫెరా’ను చదవడం తప్పని సరి.‘బందీ ఛోడ్ దివస్’ పండుగను దీపావళి మాదిరిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఒక్క పండగ తప్ప మిగతా అన్నిటినీ వారి పది మంది మత గురువుల (గురునానక్ నుంచి పదో గురువైన  గురు గోబింద్‌సింగ్‌జీ వరకు) జయంతులనే ప్రధాన వేడుకలని చెప్పాలి. ఆదివారం జరిగిన ‘సింగ్‌సభ’ వ్యవస్థాపకుడు హర్‌మహేందర్‌సింగ్ బగ్గా వర్ధంతికి సుమారు వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు.

 

పిల్లలకు పంజాబీ..


వీరి పిల్లలు కూడా నగర జీవనంలో వుమేకమై పోయూరు. స్థోవుత ఉన్నవారు ఇంగ్లిష్ మీడియుం స్కూళ్లలో చదివిస్తుంటే, మిగతా వారు ప్రభుత్వ పాఠశాలలకు పంపుతుంటారు. ఇక పంజాబీ నేర్పించేం దుకు వూత్రం గురుద్వారాల్లో వేసవి శిబిరాలు నిర్వహిస్తుంటారు.

 

ఇది మా మాతృనగరం

హైదరాబాద్ గురించి ఏం చెప్పాలి? ఇది మా మాతృనగరం. నేను పుట్టింది ఇక్కడే. హైదరాబాద్ పంజాబ్ ఈ రెంటి మధ్య మాకు తేడా కనిపించదు. 1947 తర్వాత మా వాళ్లు ఇక్కడికి వచ్చారట. మా ఇంట్లో వాళ్లకు తెలుగు బాగా వస్తుంది. నాకు అర్థమవుతుంది. ‘హిందువూ లేడు, ముసల్మానూ లేడు’ మనుషులందరూ ఒక్కటే. మానవత్వమే మా మతం. మా స్కూల్‌లో ఎక్కువగా ముస్లింల పిల్లలే చదువుకుంటున్నారు.

 - కులదీప్‌సింగ్ బగ్గా, అఫ్జల్‌గంజ్ గురుద్వారా ‘సింగ్‌సభ’ చైర్మన్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top