రాష్ట్రంలో పాలనను మార్చితీరుతాం

రాష్ట్రంలో పాలనను మార్చితీరుతాం


జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో కోదండరాం

► కాగితాల్లో ప్రచారమే.. క్షేత్రస్థాయిలో పథకాలేమీ లేవు

►  గొర్రెలకు తీసినట్లే ట్రాక్టర్లకు లాటరీ తీయలేదెందుకు..?




సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తో రాష్ట్రంలో పాలనను మార్చి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం రాష్ట్ర కార్యాల యంలో మంగళవారం జరిగింది. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రపై సమీక్ష, భవిష్యత్‌ కార్యాచరణపై ఇందులో చర్చించారు.


అనంతరం జేఏసీ నేతలు కె.రఘు, ఇ.పురుషోత్తం, సంధ్య, భైరి రమేశ్, మాదు సత్యంతో కలసి కోదండరాం విలేక రులతో మాట్లాడారు. నాలుగు రోజులపాటు జరిగిన యాత్రలో నిరుద్యోగం, విద్య, ఆరో గ్యం తదితర సమస్య లున్నాయని, రైతులు, కార్మికులు, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తమకు చెప్పారన్నారు. ఉద్యో గాలు, ఉపాధి అవకాశాలు కావాలని యువత కోరినట్లు చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు దొరక్క, అమ్మిన ధాన్యా నికి డబ్బులు రాక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. బలవంతపు భూ రైతులు ఆందోళన చెందుతున్నా రన్నారు. బీడీ కార్మికుల కు కనీస వేతనాలు లభించడం లేదన్నారు.



భగీరథ, కాకతీయల్లో భారీ అవినీతి..

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల్లో భారీగా అవినీతి ఉందని కోదండరాం ఆరో పించారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న పథకాలు కాగితాల్లో తప్ప క్షేత్రస్థాయిలో అమ లుకావడంలేదన్నారు. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు అక్రమ దందాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై లేదన్నారు.


గొర్రెల పంపిణీకి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లాటరీ తీసినట్టుగానే ట్రాక్టర్లు అడ ుగుతున్న లబ్ధిదారుల కోసం లాటరీ ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ ప్రాం తంలోని భూగర్భంలో పగుళ్లు, పొరలు ఉన్నా యని, అక్కడ భారీ ప్రాజెక్టు కడితే నిలువదని హెచ్చరించారు. దీనివల్ల 5 లక్షల మంది ప్రజల ప్రాణాలకు అపాయమని, భూకంపం వచ్చే ప్రమాదముందని సంబంధిత నిపుణు లు హెచ్చరిస్తున్నారని వివరించారు.



కాంట్రాక్టర్ల కోసమే రీ డిజైన్లు!

సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్‌ ఖర్చును తగ్గించేలా, ఎక్కువ ఆయకట్టుకు నీరందిం చేలా ఉండాలని కోదండరాం సూచించారు. కానీ కాంట్రాక్టర్లకే లాభం కలిగించేలా, ప్రభుత్వంలో ఉన్నవారికి కమీషన్లు వచ్చేలా రీడిజైన్‌ ఉంటుందా అని ప్రశ్నించారు. తక్కువ ముంపుతో సాగునీరు, చట్ట ప్రకా రం నిర్వాసితులకు పరిహారం అందించా లని అడిగితే సాగునీటి ప్రాజెక్టులను అడు ్డకున్నట్టు అవుతుందా అని అడిగారు. కమీషన్ల కోసం చేసే రీడిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top