అక్రమ ఫైనాన్స్‌లపై దాడులు
హైదరాబాద్: నగరంలోని సౌత్ జోన్ పోలీసు డివిజన్ పరిధిలో అక్రమ ఫైనాన్స్‌లపై పోలీసులు దాడి చేశారు. చట్ట విరుద్ధంగా ఫైనాన్స్‌లు నడుపుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి డాక్యుమెంట్లు, ప్రామిసరి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అక్రమ ఫైనాన్స్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని సౌత్‌జోన్ డీసీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు.