పేకాడుతూ పట్టుపడ్డ సినీనటి

పేకాడుతూ పట్టుపడ్డ  సినీనటి - Sakshi


పేకాడుతూ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్  పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి వనస్థలిపురం పరిధిలోని జహంగీర్‌కాలనీలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాడుతున్న సినీ నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణితోపాటు 11మందిని అరెస్ట్‌చేశారు.


కాగా పోలీసుల్ని చూసి జూదగాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా,  వారిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది.  పేకాట స్థావరంలో రూ. 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా తనను కావాలనే ఇరికించారని కల్యాణి వాపోయింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top