pay by sms

pay by  sms


షార్ట్ ఫిల్మ్‌లకూ కలెక్షన్లు వెల్లువెత్తాలి. అవీ బాక్సాఫీస్ బద్ధలు కొట్టాలి. చిన్ని చిత్రం.. సిల్వర్‌స్క్రీన్‌కు ఒక మార్గంగా మాత్రమే మిగలకూడదు. తనకు తాను బలమైన మాధ్యమంగా రూపొందాలి. ఇప్పుడు టీవీల్లోకి వస్తున్నట్టుగానే.. సినీనటులు సైతం పొట్టి చిత్రాలకు సై అనాలి. అది జరగాలంటే షార్ట్‌ఫిల్మ్స్ ఆదాయం పెరగాలి. వేలాదిగా చిట్టిచిత్రాలు వెల్లువెత్తుతున్నా.. మరెవ్వరికీ రాని ఆలోచన మన సిటీయూత్‌కి వచ్చింది. అదే ‘టికెట్ కొని చిన్ని చిత్రాలు చూడడం’ అనే కొత్త కాన్సెప్ట్ రూపొందించేలా చేసింది. వినోద రంగంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారీ మిత్ర‘త్రయం’.

-  ఎస్.సత్యబాబు

 

హిట్స్, షేర్స్, లైక్స్.. ఇలా వ్యూయర్‌షిప్‌లో సినిమాలకు పోటీగా షార్



ఫిల్మ్‌లు ఆదరణ పొందుతున్నాయి. ఈ పొట్టి సినిమాలు సినిమా స్థాయిని చేరే క్రమం తప్పకూడదంటే ఏం చేయాలి..? తొలి అడుగు ఎటు పడాలి..? ఈ ప్రశ్నలకు సమాధానం.. పడిన శ్రమకు ప్రతిఫలం. ఈ ఆలోచనే పే-బై-ఎస్సెమ్మెస్‌కు స్ఫూర్తిగా నిలిచింది. చిన్ని చిత్రాల రూపకర్తలకు కొత్త ఊపిరి పోస్తూ రూపొందిన ఠీఠీఠీ.్టటజజీ.్టఠి వెబ్‌సైట్‌ను మన హైదరాబాదీలే డిజైన్ చేశారు. వినూత్న గీత అనే ప్రొడ క్షన్ హౌస్ నిర్వహిస్తున్న నగర యువకులు ఉపేంద్ర, తరుణ్, స్టోరీ టెల్లర్స్ స్టూడియోస్ నిర్వహిస్తున్న రోహిత్‌లు ఈ కాన్సెప్ట్ కోసం చేయి కలిపారు.



‘అనుకోకుండా’ ఓ ఆలోచన



‘మేం తీసిన షార్ట్‌ఫిల్మ్ ‘అనుకోకుండా’ యూట్యూబ్‌లో ఇప్పటికి 10 లక్షలుపైగా హిట్స్ సాధించింది. అయితే రూ.2 లక్షలు రాబట్టడానికి ఏడాది పట్టింది. ఇదే మాకు షార్ట్‌ఫిల్మ్ ద్వారా ఆదాయం పొందే మార్గాన్ని అన్వేషించేలా చేసింది. సృజనాత్మకతకు వేగంగా క్యాష్ చేసుకునేందుకు ఈ కాన్సెప్ట్ డిజైన్ చేశామ’ని తరుణ్ చెప్పాడు. వీరు నెలకొల్పిన వెబ్‌సైట్ ద్వారా సినిమాలు చూడాలంటే వీక్షకుడు రూ.5 నుంచి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో మనకు నచ్చిన షార్ట్‌ఫిల్మ్స్ పేరు మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. వాచ్ ఫుల్ మీడియా మీద క్లిక్ చేస్తే పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. అందులో కోడ్‌తో సహా ఎస్సెమ్మెస్ దేనికి పంపాలో ఉంటుంది. సరైన విధంగా మెసేజ్ పంపితే థాంక్యూ అని రిప్లై వస్తుంది. తర్వాత ఎంచక్కా ఆ సినిమా చూసేయొచ్చు. సినిమా రేంజ్‌కు అనుగుణంగా రూ.5-10 వరకు మీ ఫోన్ కాలర్ బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. ఇలా వచ్చిన ఆదాయంలో 50 శాతం ఫిల్మ్ మేకర్స్ స్టేక్ హోల్డర్స్‌కు, టెలికాం ఆపరేటర్.. ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. ‘డెబిట్ కార్డ్‌తో పనిలేకుండా పేమెంట్ ప్రాసెస్‌ను ఈజీ చేయడానికే పే బై ఎస్సెమ్మెస్ ఎంచుకున్నాం. మంచి సినిమా నిర్మాతలకు ఈ వెబ్‌సైట్ ఓ ఆదాయవనరుగా మలచాలని భావిస్తున్నాం’అని వివరించాడు రోహిత్.



డబ్బులెందుకు ఇవ్వాలి?



ఫ్రీగా సినిమాలు చూసే చాన్స్ ఉండగా.. డబ్బులెందుకు దండగా..? అని ప్రశ్నిస్తే.. ‘యూట్యూబ్‌లోని సినిమాలన్నీ బాగుంటాయనే గ్యారెంటీ ఉండదు. క్వాలిటీ బాగున్నవే మా సైట్లో ఉంటాయ’ని నమ్మకంగా చెబుతున్నారు వీళ్లు. వేలాది పొట్టి చిత్రాలు వచ్చి పడుతున్నా.. ఇప్పటి వరకు 7 సినిమాలను మాత్రమే వెబ్‌సైట్ ఎంపిక చేసుకుని ప్రదర్శిస్తోందంటే తమ క్వాలిటీ మెజర్‌మెంట్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చంటున్నారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top