పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది

పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది - Sakshi

స్కూల్ పిల్లలు కిడ్నాప్ గురికావడం తరచు వార్తల్లో వింటుంటాం. చూస్తుంటాం. న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని కిడ్నాప్ చేయడానికి దుండగుడు చేసిన ప్రయత్నాలను ఓ చిన్నారి తిప్పికొట్టింది. 

 

వివరాల్లోకి వెళితే.. అర్జెంట్ మీ అమ్మ తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఓ దుండగుడు దేశ రాజధానిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఎనిమిదేళ్ల పాపను కిడ్నాప్ కు ప్రయత్నించారు. అయితే కిడ్నాపర్ పై అనుమానం వచ్చిన ఆ చిన్నారి అందుకు సమాధానంగా పాస్ వర్డ్ చెప్పమని అడిగిందట. దాంతో కంగారుపడిన కిడ్నాపర్ అక్కడి నుంచి జారుకున్నారట. 

 

ఇంతకు అసలు విషయమేమింటంటే.. కిడ్నాపర్ల నుంచి బారిన పడకుండా తల్లి, కూతుళ్లు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకున్నారట. ఏ పరిస్థితిల్లోనూ ఎవరైనా తనతో రమ్మని అడిగితే పాస్ వర్డ్ చెప్పాలని కూతురుకు తల్లి చెప్పిందట. తల్లి, కూతుర్ల మధ్య పాస్ వర్డ్ ఓ ప్రమాదం నుంచి తప్పించింది. 

 

ఏమైనా కిడ్నాపర్ చిక్కుకుండా తీసుకున్న తల్లి జాగ్రత్తను ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం ఓ లేఖను ప్రకటన రూపంలో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీసులను, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను నిందించకుండా తల్లి తండ్రులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. అందరికి మంచిదే కదా....
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top