చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి - Sakshi


వైఎస్సార్‌సీపీ భారీ ధర్నాతో దద్దరిల్లిన రాజధాని


 


హైదరాబాద్: విద్యుత్, బస్సు చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ శనివారం ఇక్కడ చేపట్టిన రాస్తారోకో, ధర్నాలతో రాజధాని దద్దరిల్లింది. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ కమిటీలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శన ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలం టూ పార్టీ శ్రేణులు పెద్దపెట్టున నినదించాయి. ప్రజలపై భారం మోపి బంగారు తెలంగాణ సాధిస్తారా అంటూ ప్రభుత్వపెద్దలను నిలదీ శాయి. ప్రజలపై భారం మోపుతున్న సీఎంకు బంగారు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, మహానేత వైఎస్సార్ హయాం లో ఏనాడూ ఏ చార్జీలూ పెంచలేదంటూ... కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్, వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలి, వైఎస్సార్ జిందాబాద్, జై జగన్ అంటూ రోడ్డుపై బైఠాయించారు.





భారీ వలయంలా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేతలు మతీన్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు శ్యామల, రఘురామిరెడ్డి తదితరులతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.


 

రెండేళ్లలో ఎలాంటి ప్రగతీ లేదు: గట్టు


నిరసన సందర్భంగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ టీ ఆర్‌ఎస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి ప్రగతీ జరగలేదన్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజలపై కరెంట్, బస్సు చార్జీల రూపంలో దాదాపు రూ.2 వేల కోట్ల పెనుభారాన్ని మోపడం సమంజసం కాదన్నారు. పెం చిన చార్జీలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయా న్ని నిరసిస్తూ  రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క చార్జీ పెంచలేద ని, ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారాన్ని మోపలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ అందుకు పూర్తి విరుద్ధంగా మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ, వివిధ రూపాల్లో ప్రజ లపై భారాన్ని మోపుతున్నారని అన్నారు.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top