అయ్యో..ఓయూ..

అయ్యో..ఓయూ..


ఓయూలో  నిధుల కోసం మల్లాగుల్లాలు

ప్రణాళికలు బారెడు... నిధుల కేటాయింపు మూరెడు

శతాబ్ది ఉత్సవాలకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమే




తార్నాక: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్సవాలను ప్రపంచ కీర్తిని గడించేలా నిర్వహించాలనుకున్న అధికారుల ఆశలపై నిధుల కేటాయింపు నీళ్లు చల్లింది.  ఎన్నో ఆశలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించిన అధికారుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. కోట్ల రూపాయల అంచనాలతో అధికారులు ప్రణాళికలు సిద్దం చేయగా, ప్రభుత్వం కేటాయించిన నిధులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. దాదాపు రూ.416 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ఓయూ అధికారులు నివేదించగా, ఈ వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులకు ,అంచనా వ్యయానికి పొంతనలేకుండా పోవడంతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల విషయమై ఓయూ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవంటున్నారు. ముఖ్యంగా ఓయూలో విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది. కనీసం తొలి దశలో హాస్టళ్ల ఆధునీకరణకు శ్రీకారం చుడితే బాగుంటుందంటున్నారు.



అంచనా వ్యయం రూ.416కోట్లు.. ఇచ్చింది రూ.200 కోట్లు...

శతాబ్ది ఉత్సవాలను  అట్టహాసంగా నిర్వహించాలని, ఈ సందర్బంగా స్థిరంగా గుర్తుండేలా ఉండేందుకు గాను పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. అందుకు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మూడు నెలల ముందుగానే వివిధ రకాలుగా తాము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమాలకు  రూ.416 కోట్లు అంచనా వ్యయంగా నివేదిక అందజేశారు.



అంచనా ఇలా..

ఓయూలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను రెండు విధాలుగా రూపొందించారు. అందులో ఒకటి మౌళిక సదుపాయాల కల్పన అంశం కాగా, రెండవది వర్సిటీలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు వాటికి కేటాయించిన అంచానా విలువలు ఇలా ఉన్నాయి..



రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో..

అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్త్రపతి హాజరు అవుతున్న నేపథ్యంలో  ఆయన స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు  అత్యవసరంగా రూ.20 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నిధులతో ప్రారంభ కార్యక్రమాలను గట్టెక్కించే దిశగా అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.



శతాబ్ది  ఉత్సవాల నిధుల వినియోగంపై ప్రత్యేక అధికారి..?

ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ఓయూకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిసింది. కేటాయించిన నిధులను సదరు అధికారి పర్యవేక్షణలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని పలువురు సీనియర్‌ అధ్యాపకులు పేర్కొంటున్నారు.ఈ నిధులతోని ప్రతి రూపాయికి అధికారులు లెక్క చూపాల్సి ఉంటుందంటున్నారు. కాగా  ఈ విషయమై ఓయూ అ«ధికారులను సంప్రదించగా, దీనిపై స్పష్టత ఇవ్వడంలేదు.

http://img.sakshi.net/images/cms/2017-03/61490033012_Unknown.jpg

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top