స్మార్ట్గా.. సాఫీగా..

స్మార్ట్గా.. సాఫీగా..


గ్రేటర్‌లో సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం

సాక్షి, హైదరాబాద్: ఇరుకై న రహదారులు.. ఆపై గతుకుల మార్గం.. దానికి తోడు వాహనాల రద్దీ.. వాటి నుంచి వెలువడే పొగ.. గుంతల కారణంగా రేగే దుమ్ము, ధూళి.. వీటి వల్ల పెరిగిపోతున్న కాలుష్యం.. ఇవీ నగర రోడ్లపై నిత్యం మనకు కనిపించే దృశ్యాలు. ఇకపై ఇటువంటి అనుభవాలు నగరజీవికి ఉండకపోవచ్చు. ఈ సమస్యల నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపడుతోంది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిస్టమ్(ఐటీఎస్) పేరుతో నూతన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతోంది. ఇందుకవసరమయ్యే నిధులను ఇవ్వడానికి జైకా ముందుకొచ్చింది. రూ.53 కోట్ల ఆర్థికసాయం చేస్తోంది. నెదర్లాండ్‌కు చెందిన ఏఆర్‌ఎస్ కంపెనీ సహాయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. వచ్చే నెలలో ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు అందనున్నారుు. జనవరిలో పనులు ప్రారంభిస్తారు.


సాఫీ ప్రయాణం..

ఐటీఎస్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడం, వాహనదారులకు సౌకర్యవంతమైన రోడ్డు సేవలు అందించడం, వాహన రద్దీని నివారించడం, సమయం, ఇంధనం ఆదా చేయడం తదితర 11 సేవలు పొందవచ్చు. తొలిదశలో ఇన్నర్ రింగ్ రోడ్, నగరం నుంచి జాతీయ రహదారులను అనుసంధానం చేసే మార్గాల్లో ఉంటారుు. ఈ మార్గాల్లో ఆటోమేటిక్ వెహికిల్ క్లాసిఫైర్ కౌంటర్(ఏవీసీసీ), సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 230 కిలోమీటర్ల మేర ఈ దారుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిర్మాణాలకు 47 చొప్పున ఏవీసీసీలు, సీసీ కెమెరాలు అమర్చుతారు. సదరు మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, ఏయే వాహనాలు ఎంత వేగంతో వెళ్తున్నారుు.. అందుకు గల కారణాలు, కి.మీ. ప్రయాణానికి ఎంత సమయం పడుతోంది.. తదితర వివరాలను అవి సేకరిస్తారుు. ఈ డేటా అంతా నానక్‌రాంగూడలోని కమాండ్ కంట్రోల్ వ్యవస్థ(సీసీసీ)కు చేరుకుంది. అక్కడ దాని విశ్లేషిస్తారు.


పలు శాఖలతో సమన్వయం..

ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు కూడా ఐటీఎస్ సాయపడుతుంది. వేగంగా సమాచారం చేరవేయడంతోపాటు అధికారులను అప్రమత్తం చేయడానికి వీలుంది. రోడ్డు ప్రమాదాలు జరిగితే సమీపంలోని హాస్పిటల్స్‌కు, పోలీసులకు సమాచారం అందుతుంది. దీంతో ప్రాజెక్టు అమలు కోసం పలు శాఖలతో హెచ్‌ఎండీఏ సమన్వయం చేసుకుంటోంది. ఐటీఎస్ పనితీరును వర్క్‌షాప్‌ల ద్వారా ఆయా శాఖల అధికారులకు వివరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, ఆర్టీసీ, హాస్పిటల్స్, కాలుష్య నియంత్రణ మండలి, వాతావరణ శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు.


ట్రాఫిక్ కష్టాలకు చెక్..

ట్రాఫిక్ జాం వివరాలు వాహనదారులకు తెలిసేలా ప్రతి కూడలి వద్ద వేరబుల్ మెసేజ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వాహన రద్దీ తీరు, ప్రతి కి.మీ.కు ఎంత సమయం పడుతుంది.. తదితర వివరాలు ఆ బోర్డుపై డిస్‌ప్లే అవుతారుు. వాహన రద్దీ అధికంగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవచ్చని సలహా కూడా దీని ద్వారా ఇస్తారు. ఫలితంగా వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పి సమయం, ఇంధనం ఆదా అవుతారుు. అలాగే నగరంలో నిత్యం ఏయే రకాల వాహనాలు ఎన్ని రోడ్డెక్కుతున్నారుు.. అదీ ఏ సమయంలో అనే వివరాలను కూడా ఐటీఎస్ ద్వారా సేకరిచవచ్చు.


వచ్చే బస్సు ముందే తెలుస్తుంది

ఐటీఎస్ సేవలు బస్సు ప్రయాణికు లకూ అందుతారుు. నగరంలో 2 వేల బస్సుల్లో జీపీఎస్ పరికరాలు అమర్చుతారు. దీంతో ఆయా దారుల్లో తిరిగే బస్సుల  వివరాలు ముందే తెలుస్తారుు. ఇందుకోసం బస్‌స్టాపుల్లో డిజిటల్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతాల వివరాలనూ ఐటీఎస్‌తో అనుసంధానిస్తారు. మనం వెళ్లే ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ ప్రాంతాలు.. అక్కడ ఖాళీగా ఉందో లేదో  తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఐటీఎస్ సేవలను ఎస్‌ఎంఎస్, యాప్ ద్వారా అందించేందుకు అధికారులు యోచిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top