ట్రెండ్ గురూ..

ట్రెండ్ గురూ.. - Sakshi


పెళ్లంటే తప్పెట్లు... తాళాలు... తలంబ్రాలు.. ఇక్కడితోనే ఆగడం లేదు ఇప్పటి వివాహ  వేడుకలు. భారీ సెట్లు ఉండాలి... అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వాలి.. వధూవరులు పెళ్లి వస్త్రాల్లో తళుక్కుమనాలి. అందరి దీవనెలతో పాటు ప్రశంసలు అందుకోవాలి. మరి కోరుకున్నట్లు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో వయ్యారాలు పోవాల్సిందే. ఒక్క పెళ్లి కూతురే కాదు పెళ్లి వేడుకలకు హాజరయ్యే ప్రతిఒక్కరూ ఆధునిక డిజైన్లు అద్దుకున్న శారీలు, గాగ్రాలు, లెహంగాలు, డ్రస్సుల్లో తళుక్కు మనేందుకు ఇష్టపడుతున్నారు. సంప్రదాయ పద్ధతినే ఫాలో అవుతూ నయాట్రెండీ డ్రెస్సులకు అలవాటుపడిన సిటీవాసుల నాడి పట్టుకున్న కృష్ణ కార్తీక్ ‘హనీశా రాయల్ కౌచర్’ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వెడ్డింగ్ కలెక్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంప్రదాయ శారీల స్థానంలో ప్యూర్ డిజైన్ చీరలను పరిచయం చేశారు.              

     - సాక్షి, సిటీబ్యూరో

 

మహిళల వెతలు విని...

 

నేను పుట్టి పెరిగింది సిటీలోనే. చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ డ్రెస్సులంటే మోజు. బీకామ్ చేశాక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజినీర్ (ఎంసీఎస్‌సీ) చేశా. సిటీలోని టాప్ ఐటీ కంపెనీల్లో పనిచేశా. ఆ తర్వాత రెస్టారెంట్ బిజినెస్ చేశా. ఆ తర్వాత ఓ ఎన్జీవోలో కౌన్సెలర్‌గా ఉద్యోగం చేశా. ఈ సమయంలోనే చాలా మంది మహిళల వెతలు విన్నా. దాంపత్య జీవితంలో అనర్థాలతో, గృహహింస కారణంగా కోర్టుకెళ్లి విడాకులు తీసుకోవాలనుకున్న మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తీసుకొచ్చా. పెళ్లి సందర్భంలో దుస్తులు, బంగారం విషయాల్లో జరిగిన గోడును వినిపించేవారు. వారు డ్రెస్సులపై చూపిస్తున్న ఆసక్తితో పాటు అప్పటికే నాకు ఫ్యాషన్‌పై ఉన్న మోజు హనీశా రాయల్ కౌచర్ ప్రారంభించేందుకు దోహదం చేసింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న ఫ్యాషన్ డిజైన్ ట్రెండ్‌ను గమనించా. బెస్ట్ డిజైనర్ల చేతిలో డిజైన్లద్దుకున్న శారీలు, లెహంగాలు, హాఫ్ శారీల కలెక్షన్ సేకరించా. హైదరాబాదీలతో పాటు వివిధ నగరాల్లో ఫుల్ రెస్పాన్స్ ఉందని అంటున్నారు బెస్ట్ కలెక్షన్ హీరో కృష్ణ కార్తీక్.

 

తప్పులే మెళకువలు నేర్పించాయి...


 

బ్రాండ్ షూటింగ్‌పై నాకు జీరో నాలెడ్జ్. టెక్నికల్‌గా కెమేరా ఎలా ఉపయోగించాలో తెలియదు. మోడల్స్‌ను కెమేరాలో బంధించే విధానంలో తొలి, రెండు షూట్‌లలో బాగానే తప్పులు చేశా. ఫొటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత నా టీమ్‌తో ఇతర బ్రాండ్లకు కూడా షూట్ చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు.  

 

కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా...

 

బెస్ట్ డిజైనర్ల నుంచి వెడ్డింగ్ వేర్, బ్రైడల్ వేర్, గౌన్‌లు, హాఫ్ శారీస్, అనార్కలీ శారీ కలెక్షన్స్ సేకరించాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డ్రెస్సులు డిజైన్ చేయిస్తున్నాం. భవిష్యత్‌లో పెళ్లికూతురుకు అవసరమయ్యే ప్రతి వస్తువు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికతో ముందుకెళుతున్నాం. లేడీస్ సెక్షన్‌లో హ్యండ్ బాగ్స్, ఫుట్‌వేర్‌లలో త్వరలో ఎంటర్ కాబోతున్నాం. ప్రాంఛైజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు కృష్ణ కార్తీక్.

 

ఇవీ  ప్రత్యేకతలు...

 

పెళ్లి కూతురు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలైట్ శారీ, ప్యూర్ జార్జెట్ శారీ, క్రేప్ సిల్క్ శారీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆర్ట్ వర్క్ బ్రైడల్ వేర్, రెడ్ డిజైనర్ లెహంగాలపై కూడా అతివలు మనసు పారేసుకుంటున్నారు. సంపన్న కుటుంబాలవారు స్లీవ్ లెస్ పింక్ స్టోన్డ్ వర్క్ గౌన్, స్లీవ్ లెస్ పింక్ గౌన్, స్లీవ్ లెస్ గౌన్, రాయల్ కలెక్షన్ లాంగ్ గౌన్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు పింక్ డిజైనర్ హాఫ్ శారీ, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ హాఫ్ శారీ, రెడ్ అండ్ క్రీమ్ కలర్డ్ హాఫ్ శారీ, యెల్లో రెడ్ హాఫ్ శారీ, రెడ్ హాఫ్ శారీ, పింక్ హాఫ్ శారీ, హాఫ్ శారీ వెల్వెట్ అండ్ హ్యాండ్‌క్రాఫ్ట్ ఎంబ్రాయిడరీ, ఫిష్ కట్ డిజైనర్ హాఫ్ శారీ, హాఫ్ వైట్ అనార్కలీ, పింక్ డిజైనర్ అనార్కలీ, హాఫ్ వైట్ అండ్ పింక్ డిజైనర్ పీస్, ఆరెంజ్ చిఫోన్, బ్లూ కుర్తా అనార్కలీ శారీలకు సిటీవాసులు మొగ్గుచూపుతున్నారని  చెబుతున్నారు హనీశా రాయల్ కౌచర్ ఫౌండర్ కృష్ణ కార్తీక్. ఇండియాతో పాటు ఆస్ట్రేలియాలోనూ ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామన్న కృష్ణ కార్తీక్... భవిష్యత్‌లో అమెరికాతోపాటు మరిన్ని దేశాలకు తమ అమ్మకాలను విస్తరించాలని అనుకుంటున్నామని వివరించారు.    

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top