నయీమ్ మరో డ్రైవర్ అరెస్ట్
హైదరాబాద్: నయీమ్ అనుచరుడైన మరో డ్రైవర్ ఫయీముద్దీన్ అలియాస్ ఫయాజ్ను శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం గురువారం పట్టుకుంది. ఇప్పటికే నార్సింగ్ పోలీసుల కస్టడీలో ఉన్న నయీమ్ అల్లుడు ఫయీమ్ చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని రోషన్‌కాలనీలో నివాసముండే ఫయాజ్‌పై నిఘా వేసి ఉంచారు. ఈ మేరకు అతడిని అనుసరించిన పోలీసులు శాతంరాయ్ ప్రాంతంలో గురువారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు.
అతడి వద్ద నుంచి ఒక తపంచా, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతడు నివాసముండే రోషన్కాలనీలోని ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఫయాజ్ భార్యతో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ద్విచక్రవాహనంతో పాటు రెండు స్పోర్ట్స్ బ్యాగుల్లో వందలాది భూ డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.