సంసారానికి పనికిరాడు విడాకులిప్పించండి!


తన భర్త సంసారానికి పనికి రాడని, విడాకులు ఇప్పించాలని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

 


వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్ కు చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ కుమారుడు (26) జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను 5 నెలల క్రితం పెద్దల సమక్షంలో నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం భార్యతో కాపురం చేయలేదు. అనుమానం వచ్చిన ఆమె తన భర్తకు వైద్య పరీక్షలు చేయించింది. అతను సంసారానికి పనికి రాడని వైద్యులు తేల్చారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తన కూతురుకి విడాకులు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఒప్పుకోని భర్త కుటుంబీకులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె శుక్రవారం రాత్రి లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి, కొడుకుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top