లెట్స్ సెలబ్రేట్

లెట్స్ సెలబ్రేట్


 అమ్మాయిలంటేనే రంగులు. ఇక రంగుల పండుగ హోలీ, సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు ఒకచోట చేరితే... ఆ వేడుక చూడటానికి వేయి కళ్లు చాలవు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. సీనియర్, జూనియర్ సరిహద్దులను చెరిపి చెలిమికి బాటలు వేసేదీ రంగోలీ. ఈ సంబురంలో భాగంగా ఇంటాబయట రెండు రోజులు సప్తవర్ణశోభితమవుతున్న యువతుల మనోభావాలు... ఈరోజు క్యాంపస్ కబుర్లు!

 భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి

 

 మౌనిక: హోలీ... చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ కలిసి ఆడుకునే ఆట. మామూలుగా కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ అనే గీత ఉంటుంది కదా! దాన్ని పూర్తిగా చెరిపేసే రోజిది.

 పల్లవి: రియల్లీ... ఈరోజు పొద్దున నా ఫ్రెండ్ సీనియర్‌పై రంగు వేసింది. దాంతో తనకు కొంచెం కోపం వచ్చి వద్దని చెప్పింది.

 

  కాసేపటికే ఆ సీనియర్ గుప్పెడు రంగు తీసుకొచ్చి మా ఫ్రెండ్‌పై చల్లింది. అంతే... అంతా కూల్. మేమంతా తలో చెయ్యా వేశాం.  భాగ్య: అంతేగా... నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలిసేది ఈరోజే. హోలీ ముందు రోజు కాలేజీలో, ఈరోజు ఇంట్లో. మొత్తానికి రెండు రోజులు ఫుల్ ఎంజాయ్‌మెంట్.

 

 పూస: ఇంట్లో అన్నయ్యలపై తప్ప అందరిపై రంగులు వేస్తాం మేం.  

 ప్రణీత: ఇంటి దగ్గర అమ్మానాన్నలు ఎక్కువసేపు ఆడనివ్వరు. అందుకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లిపోతాం.

 మాధురి: పండుగ

  సంబరాలను చెడగొట్టే రసాయనిక రంగుల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

 

 కల్పన: సునేర్‌ని వాడితే స్కిన్ పాడైపోతుంది. దాన్ని నీళ్లలో కలిపి మీద పోయడం కూడా మంచిది కాదు.

 

 మాధురి: అందుకే చాలావరకు గులాల్ వాడుతున్నాం. నీళ్లలో కలపకుండా డ్రై కలర్స్‌నే చల్లుకుంటున్నాం. నీళ్లతో కడిగితే వెంటనే పోతాయి.

 

 భావన: నాలుగైదేళ్ల నుంచి నేచురల్ కలర్స్ తయారీపై అవగాహన రావడం వల్ల మేమూ ఇంటి దగ్గర ఆడే హోలీకోసం కొన్ని రకాల రంగులు తయారు చేసుకుం

 టున్నాం.

 

 భాగ్య: ఇంటి దగ్గర కంటే కాలేజీలోనే బాగా ఎంజాయ్ చేస్తాం. ఎటు చూసినా ఫ్రెండ్సే కదా! కొందిరిపై ఇష్టంతో... ఇంకొందరిపై కోపంతో(నవ్వుతూ) పరుగులు పెట్టించి మరీ పూసేస్తాం.

 

 ప్రణీత: చిన్నప్పుడు పండుగ పేరుతో రంగులు పోసుకునేవాళ్లం. ఇప్పుడు మనసులో భావాలను తెలుపుతూ, ఎదుటి వారిపై ఉన్న ఇష్టాన్ని తెలుపుతూ ఎంజాయ్ చేసే వయసు కదా! ఈ రోజు శత్రువులు కూడా స్నేహితులయిపోతారు.

 

 శైలజ: పండుగకు రెండు రోజుల ముందు నుంచే కాలేజీలో రంగుల వర్షం కురుస్తుంది. అందుకే ఓ మోస్తరుగా ఉండే డ్రెస్సులు వేసుకొస్తాం. వాటిపై కూడా సెటైర్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం.

 

 భాగ్య: మొత్తానికి ఇంటికెళ్లేలోపు మా రూపులు మారిపోతాయి. అమ్మ చూసి... ‘అప్పుడే మొదలుపెట్టారా’ అంటూ నిట్టూరుస్తుంది. తెల్లారిందో లేదో ఇంటి చుట్టుపక్కలవారితో  పండుగ మొదలైపోతుంది.

 

 స్వరూప: వదిన, అత్త వరసున్నవాళ్లతో బాగా ఆడతాం. వాళ్లు కూడా మాపై రంగు పోయడానికి బాగా ప్రిపేర్ అవుతారనుకోండి. ఎవరి ప్రతాపాలు వారు చూపించుకుంటారు. మొత్తానికి పండగరోజు సాయంత్రానికి ఎవరి ముఖాలు వాళ్లు గుర్తుపట్టుకునే పరిస్థితి ఉండదు.

 

 విజయలక్ష్మి: నాకు మాత్రం కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఫైనలియర్ స్టూండెంట్స్‌మి కదా! ఇప్పటివరకూ హోలీ అంటే ఇంట్లో, కాలేజీలో.. రెండు చోట్ల వేడుక. వచ్చే ఏడాది నుంచి ఇలా రెండు చోట్ల ఎంజాయ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు.

 

 హనీష: అందుకే ఈసారి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. పొద్దున బ్యాగులో బుక్స్‌కి బదులు రంగు పొట్లాలతో దిగాం.

 

 మౌనిక: కోఎడ్ కాలేజీల్లో కంటే మా దగ్గరే అమ్మాయిలు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. అక్కడయితే అబ్బాయిల మధ్య కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. అంతా మా రాజ్యం.

 

 శైలజ: ఈరోజు స్పెషాలిటి ఏంటంటే మీరు వేరు, మేం వేరు అనేది ఉండదు. కాలేజీ కాంపౌండ్‌లో ఎవరు కనిపించినా రంగులమయం అయిపోవాల్సిందే.

 

 ప్రియాంక: లెక్చరర్స్ కూడానా...(నవ్వుతూ)

 

 భాగ్య: అమ్మో మేడమ్స్‌పై రంగులా!

 

 పల్లవి: ఓన్లీ స్టూడెంట్స్‌మే సెలబ్రేట్ చేసుకుంటాం.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top