కూచిపూడి విశ్వరూపం

కూచిపూడి విశ్వరూపం


 వైభవంగా ప్రారంభమైన నాట్య సమ్మేళనం

 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు హాజరు


 

 సాక్షి, హైదరాబాద్: నాలుగో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాల యోగి స్టేడియంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్ర మంలో తొలి రోజు ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 18 దేశాల నుంచి 8500 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, కువైట్, హాంగ్‌కాంగ్, సింగపూర్ తదితర దేశాల నుంచి  కళాకారులు తరలివచ్చారు. ఈ సమ్మేళనాన్ని ఎంపీ కవిత, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌లు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కూచిపూడి ప్రపంచ విఖ్యాత కేంద్రం కావాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. కూచిపూడి నృత్యం విశేష ప్రచారానికి ప్రధానితో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కూచిపూడి కేవలం ఏపీకి చెందిన కళ కాదని, విశ్వవ్యాప్తమని చెప్పారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ త్వరలో కూచిపూడి నాట్య కళల అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కళా వ్యాప్తి కోసం ఏపీ ప్రభుత్వం క ట్టుబడి ఉందని, సిలికానాంధ్ర సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి కళకు విశేష సేవలందిస్తున్నందని అభినందించారు. కవిత మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో ఉత్కృష్ఠమైనదని, కళలకు ఎల్లలు లేవని అన్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటేనని చెప్పారు. సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికే అంతర్జాతీయ నాట్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో పద్మభూషణ్ రాజా రాధారెడ్డి, పద్మభూషణ్ యామి ని కృష్ణమూర్తి, పద్మశ్రీ కె.శోభానాయుడు, వేదాంతం రామలింగశాస్త్రి, పసుపర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ శర్మ, వేదాంతం రాధేశ్యాం, కె. ఉమారామారావు, ఆర్. కవితాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూచిపూడి దిగ్గజాలందరూ కలసి బాలా త్రిపుర సుందరి, శ్రీరామలింగేశ్వరస్వామి, వెంపటి చినసత్యం తదితరుల చిత్రపటాలతో చేసిన కూచిపూడి శోభాయా త్ర ఆకట్టుకుంది. తొలిరోజు ‘అంబా పరాకు’ అంటూ సామూహిక గురు ప్రార్థనతో మొదలైన ప్రదర్శన ఆద్యంతం రక్తికట్టించింది. అనంతరం నర్తకి యామినిరెడ్డి తన బృందంతో శివుడ్ని స్తుతిస్తూ చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. శోభానాయుడు శిష్యబృందం అమెరికా నుంచి విచ్చేసిన జ్యోతి చింతలపూడి, రష్యా కళాకారులు అన్నా మౌషక్, ఎలీనా తరషోవాతో కలిసి చేసిన ‘వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీ రాముడు’ అంశం సుమనోహరంగా సాగింది. విశాఖ నాట్యగురు బాల కొండలరావు శిష్యబృందం ‘ఆలోకయే శ్రీబాలకృష్ణం’ అంటూ తరంగం ప్రదర్శించి కరతాళధ్వనులందుకున్నా రు. బెంగళూరు కళాకారులు సరస్వతీ రజేతేష్ ఆధ్వర్యంలో దశోహం ప్రదర్శించారు. తొలిరోజు గ్రాండ్ ఫినాలెగా పసుమర్తి రామలింగశాస్త్రి శిష్య బృందం ‘ శిశిరేఖ పరిణయం ’ యక్షగానం ప్రదర్శించి  అలరించారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ యక్షగానం విశేషంగా ఆకర్షించింది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top