కేఆర్కే ‘క్రాకర్’!

కేఆర్కే ‘క్రాకర్’!


ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులున్నారో తెలుసుకోవాలంటే ఒక్క బాలీవుడ్‌ను టచ్ చేస్తే సరిపోతుందేమో! ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూనే అందులోని మనుషులతో గిల్లికజ్జాలు పెట్టుకోవడంలో కింగ్ కమాల్ రషీద్‌ఖాన్. ఎప్పుడూ ఎవరో ఒకర్ని ఎత్తి పొడవనిదే మనోడికి నిద్ర పట్టేలా లేదు.



రీసెంట్‌గా రిలీజైన సోనమ్‌కపూర్ ‘డాలీ కి డోలీ’ మూవీకి ఎవరూ అడగా పెట్టకుండానే సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చేశాడీ నటుడు. అంతటితో ఆగాడా... సోనమ్ అసలు నటే కాదని, సదరు సినిమాలో తను చేసిన యాక్షనేమీ లేదని ట్విట్టర్‌లో ఓ కామెంట్ రాసిపారేశాడు. అయితే బిజినెస్ పరంగా ఓ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు!

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top