27 నుంచి విదేశీ పర్యటనకు స్పీకర్ కోడెల


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్  కోడెల శివప్రసాదరావు ఈ నెల 27 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెల (అక్టోబర్) తొమ్మిదో తేదీ వరకూ ఆయన పర్యటన కొనసాగనుంది. ఆఫ్రికా దేశం కామెరూన్ లో జరిగే కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటిస్తారు. ఈ సమావేశాలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరవుతోంది. ఏపీ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్ర పాణి, శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.

 

స్పీకర్ విదేశీ పర్యటన సబబు కాదు: మైసూరా రెడ్డి

 

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వనరులు బొటాబొటిగా రాష్ట్ర అవసరాలకు సరిపడా మాత్రమే ఉన్నపుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు కామన్వెల్త్ స్పీకర్ల సదస్సుకు హాజరయ్యేందుకు విదేశీ పర్యటనకు వెళ్లడం ఏ మాత్రం సబబు కాదని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top