కోదండరాం పార్టీ పెట్టాలి

కోదండరాం పార్టీ పెట్టాలి - Sakshi


జై కిసాన్‌ ఆందోళన్‌ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ సూచన



సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని జైకిసాన్‌ ఆందోళన్‌ కన్వీనర్, ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నా రు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, చైతన్యమైన మీడియా.. ఇలా నీతితో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు విలువలతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ  అడ్వొకేట్‌ జేఏసీ ఏర్పాటు చేసిన ‘ప్రత్యామ్నాయ రాజకీయం’ అంశంపై ఆయన మాట్లా డారు.



ప్రభుత్వ ఏర్పాటుకు ముందుండే పార్టీ నిజాయితీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గాలిలో కలసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సమస్యల పరిష్కార దృష్టి.. ఇలా అనేక అంశాలతో అనుభవజ్ఞులతో కూడిన పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.  కోదం డరాం నేతృత్వంలో విలువలతో కూడిన పార్టీ ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలన్నీ ఒక సామాజిక ఎజెండాతో వచ్చి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణలోని పరిస్థితులపై కోదం డరాం, అడ్వొకేట్‌ జేఏసీతో చర్చించారు.



అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయి

కోదండరాం మాట్లాడుతూ అరవై ఏళ్ల పాటు  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని  అన్నారు. విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావడం తప్పదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ ఏర్పాటును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొ న్నారు. పాలనా వ్యవస్థలో అవినీతిని రూపు మాపేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా పోరా డేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  ఉద్య మాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పెత్తందారి దోపిడీయే కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందున్న పార్టీ కర్తవ్యాలు ఆ తర్వాత మారిపో వడం సమాజాన్ని అజ్ఞాతంలోకి నెట్టిందన్నారు.



‘‘ఆంధ్రా  కాంట్రాక్టర్లకే పనులు, సినిమాలు వాళ్లవే, చివరకు జడ్జిల విషయంలోనూ అదే నిరూపితమవడం తెలంగాణ సమాజాన్ని తీరని అన్యాయానికి గురిచేసినట్టవుతోంది. యోగేంద్ర యాదవ్‌ చెప్పిన విషయాలను తప్పకుండా జేఏసీ స్వీకరిస్తుంది. అయితే, పార్టీ ఏర్పాటుపై కాలమే సమాధానం చెప్తుంది. అభివృద్ధి, నీతి తో కూడిన రాజకీయ వేదికగా జేఏసీ నిలుస్తుంది. దీనికి అన్ని వర్గాలు, సంఘాలు, వ్యక్తులు మాతో కలిసి రావాలి. జేఏసీ ఉద్యమం స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండేం దుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి’’ అని కోదండరాం అన్నారు.



బలమైన సామాజిక పోరు

స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజల కోసం అధికారాన్ని ఉపయోగించాలని ఉద్యమ సమయంలోనే చర్చించుకున్నా మని, కానీ ఇప్పడలాంటి పరిస్థితులు కనిపించడం లేదని కోదండరాం అన్నారు. ఆ లోపాలను అధిగ మించేందుకే బలమైన సామాజిక పోరాటాలు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పార్టీలను కాదు, వ్యక్తులను, వారి సంస్కృతిని కూడా మార్చుకోవాల్సి ఉందని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే ప్రత్యామ్నాయ వేదిక రావాలని, ఆ ఆకాంక్షలను అమల్లోకి తీసుకు వచ్చేందుకు పోరాడాలన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top