అభివృద్ధి జరిగితే రైతు ఆత్మహత్యలెందుకు?: కోదండరాం

అభివృద్ధి జరిగితే రైతు ఆత్మహత్యలెందుకు?: కోదండరాం - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్నట్టుగా ఆర్థికాభివృద్ధి జరిగితే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలెందుకు చేసుకుంటున్నారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం ప్రశ్నించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భం గా తెలంగాణ విద్యావంతులు వేదిక (టీవీవీ) ఆదివారం ‘కల్లోల దృశ్యం– వ్యవసాయ రంగం’అనే అంశంపై సద స్సు నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. రైతులను గ్రామాల నుంచి పట్టణాలకు తరలించిన ప్రయత్నాలు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే మొదల య్యాయని, అదే విధానాలను తర్వాత పాలకులు కొనసాగించడం వల్ల వ్యవ సాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిందని ఆరోపించారు.


ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రైతులకు ఆదాయం పెరిగేలా సమగ్ర వ్యవసాయం విధానం తీసుకురావాలని సూచించారు. కిసాన్‌ ఏక్తా కన్వీనర్‌ దేవేంద్ర శర్మ సదస్సులో స్మారకోపన్యాసం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3,030 ఆత్మహత్యలు ఇప్పటిదాకా జరిగాయని, వీటిలో సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే 108 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. విద్యావంతుల వేదిక రూపొందించిన ‘కల్లోల దృశ్యం– వ్యవసాయ రంగం’ పుస్తకాన్ని దేవేంద్ర శర్మ, కోదండరాం ఆవిష్కరించారు. వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, జేఏసీ కన్వీనర్‌ కె.రఘు, నేతలు పశ్య పద్మ, సజయ, డాక్టర్‌ శంకర్, భైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top