సవాలుకు సై

సవాలుకు సై - Sakshi


►  సీఎం కేసీఆర్‌ సవాలును స్వీకరిస్తున్నామన్న బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి

► ప్రగతిభవన్‌లో చర్చ పెడితే కేంద్ర నిధులపై లెక్కలు తేలుస్తాం




సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శలపై ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సవాలుకు సై అని బీజేపీ ప్రకటించింది. ప్రగతి భవన్‌లో రిటైర్డ్‌ జడ్జి లేదా మధ్యవర్తుల సమక్షంలో సీఎం కేసీఆర్‌ చర్చకు వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్క తేల్చి చెబుతా మని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతి సవాల్‌ విసిరింది. అమిత్‌షా చెప్పిన విషయాలకు రాష్ట్రపార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టంచేసింది.రాజీ నామా విషయంలో సీఎం కేసీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.   వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయిం చిన 30 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎంకు కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సవాల్‌ విసిరారు.


గురువారం బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచం ద్రారెడ్డి, ఎన్‌వీ ఎస్‌ఎస్‌ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్‌ షా ఒక్క పర్యటనతోనే కేసీఆర్‌ తన పీఠం కదులుతోందనే అభద్రతా భావంతో ఆందో ళన చెందుతున్నారన్నారు. తెలంగాణకు కేం ద్రం నుంచి వచ్చిన రూ.లక్షకోట్లకు పైగా నిధు ల వివరాలను కచ్చితమైన లెక్కలతో ప్రజల ముందు పెడతామని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. గ్రామ స్థాయిలో పర్యటించి ప్రభు త్వ వైఫల్యాలను ఎండగడ తామన్నారు. అమి త్‌ షా క్షమాపణ చెప్పాలంటూ కేసీఆర్‌ చేసిన డిమాండ్‌ హాస్యా స్పదంగా ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top