రూ.10,876 కోట్లతో ‘కాళేశ్వరం’ రిజర్వాయర్లు

రూ.10,876 కోట్లతో ‘కాళేశ్వరం’ రిజర్వాయర్లు - Sakshi


నిర్మాణానికి సర్కారు పరిపాలనా అనుమతులు

ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి

వారంలో టెండర్లు పిలిచేలా అధికారుల కసరత్తు




సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో ఐదు ప్రధాన రిజర్వాయర్లను రూ. 10,876 కోట్లతో నిర్మించేందుకు పరిపాలనా అనుమతిలిస్తూ నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరంలో చేపట్టిన రీ ఇంజనీరింగ్‌కు అనుగుణంగా ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యాలను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం... మల్లన్నసాగర్‌ సహా మరో నాలుగు రిజర్వాయర్‌లకు గత కేబినెట్‌ సమావేశంలోనే ఆమోదించింది. వాటికి అనుగుణంగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీలతో చేపట్టనుండగా దానికి రూ.7,249.52 కోట్లకు ఓకే చేశారు.



రంగనాయక సాగర్‌ (3 టీఎంసీలు)కు రూ. 496.50 కోట్లు, కొండపోచమ్మ (ఏడు టీఎంసీలు)కు రూ.519.70 కోట్లు,  గంధమల (9.86 టీఎంసీలు)కు రూ. 860.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికింద ఉన్న ఆయకట్టుకు కన్వేయర్‌ వ్యవస్థ నిర్మాణం కోసం అదనంగా మరో రూ. 870.12 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. బస్వాపూర్‌ (11.39 టీఎంసీలు)కు రూ.1,751 కోట్లు, కన్వేయర్‌ వ్యవస్థ కోసం మరో రూ. 1,132.2 కోట్లతో అంచనాలు వేశారు. మొత్తంగా ఐదు రిజర్వాయర్ల పరిధిలో రీ ఇంజనీరింగ్‌కు ముందు పనుల విలువ రూ. 1,971.38 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ వ్యయం రూ. 12,879.29 కోట్లకు చేరింది. ఇందులో కన్వేయర్‌ వ్యవస్థకు సంబంధించిన çరూ. 2,002.32 కోట్ల పనునులను ఇప్పటికే చేస్తున్న ఏజెన్సీలకు అప్పగించనున్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా కలిగిన నీటి వాటాలను సంపూర్ణంగా విని యోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే.



వారంలో టెండర్లు..

రిజర్వాయర్ల నిర్మాణానికి వారంలో టెండర్లు పిలిచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే సిద్ధమైనప్పటికీ సాంకేతిక అనుమతుల వంటి అంశాలు మిగిలి ఉన్నందున ఈ ప్రక్రియను వారంలో పూర్తి చేసి టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. మరో 25 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.



మల్లన్నసాగర్‌ కీలకం

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ రిజ్వాయర్‌ కిందే మెదక్‌ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. ఇక్క డి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమ ల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్న సాగర్‌ నుంచే నీటి తరలింపు ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాం సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్‌ నుంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయిం చారు. 13 లక్షల ఆయకట్టుకు నీరందిం చేందుకు ఈ రిజర్వాయరే గుండెకాయగా ఉండనుంది. దీని కింద మొత్తంగా 14,367 ఎకరాల ముంపు ఉంటుందని తేలగా ఎక్కువ శాతం భూసేకరణ పూర్తయింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top