స్వలాభంకోసమే కోవింద్‌కు మద్దతు


కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ప్రకటించకముందే ఎన్డీయే ప్రకటించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను సీఎం కేసీఆర్‌ ఏపపక్షంగా బలపర్చడం చూస్తుం టే ఆయన వ్యక్తిగతంగా లబ్ధిపొందడాని కేనని స్పష్టమవుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు.


శుక్ర వారం ఆయన సచివాలయంలో మాట్లా డుతూ తెలంగాణ ఏర్పాటులో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా లోక్‌సభలో ఓటింగ్‌ పెట్టినప్పుడు కేవలం మూజువాణి ఓటుతో బిల్లు పాస్‌ చేయించి న ఘనత మీరాకుమార్‌కే దక్కుతుందన్నా రు. తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసు కున్న వారిని కాదని మతతత్వ రాజకీ యాల నుంచి వచ్చిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను కేసీఆర్‌ సమర్థించడం చూస్తుం టే సీబీఐ విచారణలు రాకుండా చూసు కోవడానికేమోనని అన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top