కూకట్పల్లిలో చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు


హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి వివేకానందనగర్లో స్కూల్ విద్యార్థులతో తీసుకుని వెళ్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులకు, బస్సులోని డ్రైవర్,క్లీనర్కు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి బస్సు వెనుక భాగంలోని అద్దాన్ని పగలకొట్టి విద్యార్థులను కిందకి దించారు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యడు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం ఘటన స్థలానికి చేరుకుని... విద్యార్థులను మరో వాహనంలో స్కూల్కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top