'ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా'

'ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తా'


హైదరాబాద్: పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు చేపట్టి, పార్టీ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు శనివారం నుంచే నగరంలో పర్యటిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.



గ్రేటర్ ఫలితాలు చూసైనా ప్రతిపక్షాలు మారుతాయనుకున్నానని, అయితే ఫలితాలపై కూడా విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. రెండు మూడు  రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ముందు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తూ కేటీఆర్ నగర ప్రజల అభిమానాన్ని చురగొన్నాడని, గ్రేటర్ అభివృద్ధి దృష్ట్యా  కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖ కేటాయిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top