‘మహా’ బడ్జెట్ రూ.5,550 కోట్లు

‘మహా’ బడ్జెట్  రూ.5,550 కోట్లు


జీహెచ్‌ఎంసీ కొత్త విధానం

www.ghmc.gov.in  వెబ్‌సైట్‌లో ముసాయిదా

acfin.ghmc@gmail.com  ద్వారా సలహాల స్వీకరణ

{పజల అభిప్రాయాలతో పూర్తి స్థాయిలో రూపకల్పన


 

 

 సిటీబ్యూరో:  బడ్జెట్ రూపకల్పనలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కొత్త బాటను ఎంచుకుంది. ముసాయిదా బడ్జెట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచి... ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు తెరతీసింది. తద్వారా అందరికీ ఆమోద యోగ్య బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సంకే తాలిచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మార్పు,చేర్పులకు సిద్ధమవుతోంది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందని భావిస్తోంది.

 

పాలక మండలి లేకున్నా...




 జీహెచ్‌ఎంసీకి పాలక మండలి లేకపోవడంతో బడ్జెట్ బాధ్యత స్పెషలాఫీసర్‌పై పడింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించాలని యోచించారు. ఠీఠీఠీ.జజిఝఛి.జౌఠి.జీ అనే వెబ్‌సైట్‌లో గురువారం రాత్రి నుంచి దీన్ని అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి బడ్జెట్ ముసాయిదాను పరిశీలించి... తమ అభిప్రాయాలను ్చఛిజజీ.జజిఝఛి ఃజఝ్చజీ.ఛిౌఝ అనే చిరునామాకు తెలియజేయవచ్చు.



భారీ మొత్తంతో...



జీహెచ్‌ఎంసీ చరిత్రలో లేనివిధంగా రూ.5,550 కోట్లతో ముసాయిదా బడ్జెట్ రూపొందించారు. రాచమార్గాలు.. పేదల గృహ నిర్మాణ ం, స్లమ్‌ఫ్రీ సిటీ, కమ్యూనిటీ హాళ్లు, పచ్చదనం, పర్యావరణం, హెరిటేజ్, కల్చర్ , పర్యాటకానికి ప్రాధాన్యమిచ్చారు. రహదారుల ఆధునికీకరణ... వసతులు, సేవలు...ఇలా విభిన్న రంగాలకు కేటాయింపులు చూపించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top