హైవేపై ప్రమాదమా..1033కు ఫోన్ చేయండి..


పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్-విజయవాడ హైవే ఎంపిక

 

చౌటుప్పల్: జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వేలాదిమంది చనిపోతున్నారు...ఈ ప్రమాదాలను నివారించే దిశగా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)అడుగులేస్తోంది.  క్షతగాత్రుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా దేశంలోని హైవేలన్నింటిపై అంబులెన్సుల ఏర్పాటుకు ఉపక్రమించింది. మొట్టమొదటగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది.

 

ఇందులో భాగంగా ఎన్‌హెచ్‌ఏఐ అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన అంబులెన్సులను ఏర్పాటు చేయనుంది. కేవలం హైవేలపై జరిగే ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆదుకునేందుకు 1033 నంబరును కేటాయించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లకు ఒక అంబులెన్సు చొప్పున 270 కి.మీ.ల పరిధిలో 5 అంబులెన్సులను ఏర్పాటు చేసింది. ఇవి..నల్లగొండ జిల్లా  చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహడ్, మునగాల, కృష్ణా జిల్లా నందిగామ మండలం చిల్లక ల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఉంటాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top