30 ఏళ్లు నిండి పెళ్లికాని మహిళలు..

30 ఏళ్లు నిండి పెళ్లికాని మహిళలు.. - Sakshi


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్లకు పైబడిన అవివాహిత ఒంటరి మహిళలు హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 36,659 అవివాహిత ఒంటరి మహిళలు రాజధానిలో ఉన్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవివాహిత ఒంటరి మహిళలకు పెన్షన్ అందజేయాలని భావిస్తున్న నేపథ్యంలో చేపట్టిన ఈ సర్వేలో.. పట్టణ ప్రాంత జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇలాంటి మహిళలు ఎక్కువగా ఉన్నారని వెల్లడైంది. హైదరాబాద్ తరువాతి స్థానాల్లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు నిలిచాయి.



ఈ పెన్షన్ పథకంలో గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఎప్రిల్ నుంచి ఈ ప్రారంభించనున్న ఈ పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఈ నెలాఖరు వరకు నిర్ణయించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు పెళ్లి కన్నా.. కెరీర్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు ఈ సర్వే ట్రెండ్స్ చెబుతున్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, వరకట్నం తదితర కారణాలతో మహిళలు అవివాహితులుగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.



జిల్లాల వారిగా ఉన్న 30 ఏళ్లకు పైబడిన అవివాహిత ఒంటరి మహిళల వివరాలు

హైదరాబాద్   36,659

మేడ్చల్        16,112

రంగారెడ్డి       12,127


మహబూబ్ నగర్    5,154

నిజామాబాద్          5,141

వరంగల్ అర్బన్     4,773

సంగారెడ్డి         4,336

నాగర్ కర్నూల్    3,992

నల్లగొండ    3,950

యాదాద్రి     3,950

కరీంనగర్    3,386

జగిత్యాల్     2,746

పెద్దపల్లి      2,501

కామారెడ్డి    2,476

మంచిర్యాల్  2,465

అదిలాబాద్  2,412

సిద్ధిపేట్      2,337

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top