ఉగ్ర అనుమానితులంతా కొత్తవారే!

ఉగ్ర అనుమానితులంతా కొత్తవారే!


ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి మెకానిక్స్ వరకు..

ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న ఏయూటీ ఉగ్రవాద అనుమానితులంతా కొత్తవారే. గతంలో ఎలాంటి నేరచరిత్ర, అనుమానితులతో సంబంధాలు లేని వాళ్లనే షఫీ ఆర్మర్ ఎంపిక చేసుకున్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వారి సంబంధీకులు, బంధువుల్నే ఎంచుకున్నాడు. వీరిలోనూ అన్ని రంగాలకు చెందిన వారు ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఆన్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరపడానికి విద్యాధికులు, కంప్యూటర్ రంగంలో అనుభవం ఉన్న వారితో పాటు బాంబుల తయారీకి మెకానిక్‌లు, పేలుడు పదార్థాల సమీకరణకు నిరుద్యోగులు, చిరుద్యోగుల్ని మాడ్యూల్‌లో నియమించుకున్నాడు.



ఆ 11 మంది వివరాలు ఇవీ..

 1. మహ్మద్ ఇలియాస్ యజ్దానీ (24), గ్రాడ్యుయేట్, తలాబ్‌కట్ట (భవానీనగర్)

 2. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ (30), ఇంజనీర్, చెత్తాబజార్ (మీర్‌చౌక్).. 3. హబీబ్ మహ్మద్ (32), కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, హస్మాబాద్ (చంద్రాయణగుట్ట)

 4. మహ్మద్ ఇర్ఫాన్ (27), ఎస్‌ఎస్‌సీ, మీరాలంమండి (మీర్‌చౌక్)

 5. అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్ (31), గ్రాడ్యుయేట్, పంచ్ మొహల్లా (హుస్సేనీఆలం).. 6. సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ (42), వస్త్ర దుకాణం, మొఘల్‌పుర

 7. ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్  (29), నిరుద్యోగి, తలాబ్‌కట్ట (భవానీనగర్)

 8. మహ్మద్ అతుల్లా రెహ్మాన్ (30), గ్రాడ్యుయేట్, బండ్లగూడ (చంద్రాయణగుట్ట)

 9. అల్ జిలానీ అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్ (32), ఆటో మెకానిక్, యూసుఫ్ గుల్షన్ కాలనీ (చంద్రాయణగుట్ట)

 10. ఏఎం అజర్ (20), ఇంటర్మీడియట్ విద్యార్థి, తలాబ్‌కట్ట (భవానీనగర్)

 11. మహ్మద్ అరబ్ అహ్మద్ (21), కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, బండ్లగూడ (ఫలక్‌నుమ).



వీరిలో ఇలియాస్ మీ సేవా కేంద్రాన్ని, హబీబ్ ఇంటర్‌నెట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇబ్రహీం యజ్దానీ వికారాబాద్‌లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో బీటెక్ (ఈఈఈ) పూర్తిచేశాడు. కొంతకాలం పాటు ఓ ఈ-కామర్స్ సంస్థ ద్వారా మెబైల్ కేసెస్, కవర్స్ విక్రయాలు జరిపాడు. ఇటీవలే దుబాయ్‌కు వెళ్లివచ్చాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top