హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని ఆదివారం మబ్బులు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురుస్తుంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కోఠి, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ పాంతాల్లో జోరున వర్షం పడుతుంది. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.