నగరాన్ని వీడని వాన

నగరాన్ని వీడని వాన - Sakshi


హైదరాబాద్:  హైదరాబాద్‌ను నాలుగు రోజులుగా వర్షాలు వీడటం లేదు. గురువారం మధ్యాహ్నం వరకు ఎండ రావటంతో వాన ఆగినట్లే అని అనుకున్నారు. కానీ అంతలోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌ నగర్, బీఎన్‌రెడ్డి నగర్, నాగోల్, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాన కురిసింది. రోడ్లపై వరద నీరు ప్రవహించటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top