హైదరాబాద్‌లో భారీ వర్షం


హైదరాబాద్‌: నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.



జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు. కాగా  ఈ వర్షంతో వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top