హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్నగర్లో భారీ వర్షం పడింది. కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బహీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బాగ్లింగంపల్లి, తార్నాకలలో వర్షం కురిసింది.
వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.