నీ గౌను.. బంగారం గాను..

నీ గౌను.. బంగారం గాను..


పాశ్చాత్య వెడ్డింగ్ గౌన్‌ల నుంచి వచ్చిన ఈ స్టైల్ నేటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్ గౌన్‌గా సెలబ్రిటీల మనసు దోచిన ఈ డ్రెస్ గ్లోబ్ మొత్తం దృష్టిని తనవైపునకు తిప్పుకుంటుంది. ఒకప్పుడైతే గౌను అంటే చిన్న పాపలకు స్పెషల్. అయితే ఇప్పుడు సిటీలో అమ్మాయిలకు అకేషన్ ఏదైనా కామన్ ఫ్యాషన్ గౌన్. అది బర్త్ డే కావచ్చు, మ్యారేజ్ డే లేదా రిసెప్షన్ కావచ్చు.. ఆఖరికి ఈవెనింగ్ పార్టీ అయినా కావచ్చు... ఏదైనా వెస్ట్రన్ రారాణిలా మెరిసిపోవడానికి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న డిజైనర్ డ్రెస్ గౌన్.

 

కొన్ని విశేషాలు...


కంఫర్టే ప్రధానంగా ఆలోచించేవారికి గౌన్ బెస్ట్. సింగిల్ పీస్ కాబట్టి గౌన్‌ను సులువుగా ధరించే సౌలభ్యం ఉంది.గౌన్ అంటే స్టైల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసినట్టే. తాము ఫ్యాషనబుల్ అని చెప్పేసినట్టే. దీంతో వస్త్రధారణలో భాగంగా మరే అలంకరణలూ అవసరం లేదు. క్యాజువల్‌గానూ, అకేషనల్లీ ఈ డ్రెస్‌ను ధరించవచ్చు.సాధారణంగా పల్చటి, మెత్తటి ప్లెయిన్ సిల్క్ లేదా షిఫాన్ మెటీరియల్‌తో పార్టీవేర్ గౌన్స్‌ను డిజైన్ చేస్తారు. నెట్టెడ్ కూడా వస్తున్నాయి. కానీ అవి పిల్లలకు తప్ప యువతులకు అంత సౌకర్యంగా అనిపించవు.



ప్లెయిన్ మెటీరియల్‌తోనే కాదు అభిరుచిని బట్టి ఎంబ్రాయిడరీని, ప్రింట్లు డిజైన్లు గల ఫ్యాబ్రిక్‌ను కూడా ఈ డ్రెస్‌కు ఎంచుకోవచ్చు.

బ్లౌజ్ పార్ట్ మంచి ఫిట్టింగ్‌తో ఉండాలి. నడుము భాగంలో ఏ మాత్రం వదులు లేకుండా సరైన కొలతలతో డిజైన్ చేయించుకోవాలి.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top