జనరల్ నాలెడ్జ్


జాతీయ గీతం (జనగణమన)



ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 24    

రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని తొలిసారిగా చిత్తుప్రతిపై ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రచించారు.

జనగణమన గీతం బెంగాలీ భాషలో ఐదు చరణాల్లో రచించగా అందులోని తొలి ఎనిమిది లైన్లలను జాతీయగీతంగా తీసుకున్నారు. ఊ తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జాతీయగీతాన్ని ఆలపించారు. ఊ జాతీయగీతాన్ని ‘మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో తిరిగి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. తర్వాత తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ అనే పేరుతో 1912లో ప్రచురించారు.

జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్ల సమయం పడితే సంక్షిప్తంగా ఆలపించడానికి 20 సెకన్లు పడుతుంది.

 

  జాతీయ ముద్ర (చిహ్నం)



→  ఆమోదించిన సంవత్సరం: 1950, జనవరి 26    ఊ జాతీయ ముద్రగా అశోకుని సారనాథ్‌లోని ధర్మస్థూపంపై ఒకే పీఠం మీదున్న నాలుగు సింహాల బొమ్మను తీసుకున్నారు. ఊ ఈ స్థూపంపై నాలుగు సింహాలు, (మూడు మాత్రమే కనిపిస్తాయి) వాటి కింద పీఠం మధ్య భాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం నుంచున్నట్లు ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి, గుర్రం వేగానికి సూచికగా భావిస్తారు. ఊ పీఠం పై భాగంలో మాండకో పనిషత్ నుంచి గ్రహించిన ‘సత్యమేవ జయతే’ అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top