సంక్షేమ పాఠశాలలకు నిధులిస్తాం: ఈటల

సంక్షేమ పాఠశాలలకు నిధులిస్తాం: ఈటల - Sakshi


సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమశాఖల పరిధిలోని విద్యావ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమ రంగంలోని పాఠశాలలు, హాస్టళ్లను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించాలని, దీనికి అవసరమైన నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు తపన, కమిట్‌మెంట్‌తో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ హాస్టళ్లపై స్పష్టమైన అవగాహన ఉంద ని, అందులో భాగంగానే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు.



వార్డెన్ ఉద్యోగం, తల్లిదండ్రులు నిర్వహించే పాత్ర కంటే తక్కువ కాదని, పనితీరులో ఓ వ్యవస్థ ఏర్పాటుచేసి, కష్టపడి పనిచేయాలన్నారు. సంక్షేమ హాస్ట ళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై సెంటర్‌ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ సర్వే నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా సచివాలయంలో ఆ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ రెడ్డప్ప పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top